Homeఆంధ్రప్రదేశ్‌పబ్లిసిటీ కోసం కోట్ల తగలేస్తారా? ఏపీ సర్కార్‌‌ పై ప్రజల ఫైర్‌‌

పబ్లిసిటీ కోసం కోట్ల తగలేస్తారా? ఏపీ సర్కార్‌‌ పై ప్రజల ఫైర్‌‌

People's fire on the YCP government

అదేంటో.. ఒక్కోసారి ఏపీ సీఎం జగన్‌ ఏ నిర్ణయాలు తీసుకుంటారో ఎవరికీ అర్థం కాదు. పెద్దగా మీడియా ముందుకే రావడానికి ఇష్టపడని ఆయన.. ఏకంగా పబ్లిసిటీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఓ జీవో విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాష్ట్ర రాజకీయ నేత ఇమేజ్‌ను జాతీయ స్థాయిలో పెంచేందుకు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపుతో ఒప్పందం చేసుకున్నారట. అందుకోసం రూ.8 కోట్ల 15 లక్షలు చెల్లించాలని నిర్ణయించారనేది ఆ జీవో సారాంశం.

Also Read: తెలంగాణను వదిలి.. ఏపీపైనే విమర్శలు?

జాతీయ స్థాయిలో పబ్లిసిటీ కోసం ఇన్ని కోట్లు ఖర్చా అంటూ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. సామాన్యుడుకి రూ.5కు భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు.. భారం అని మూసేసిన ప్రభుత్వం ఇలా.. అధికార పార్టీ నేతల ఇమేజ్ బిల్డింగ్ కోసం కోట్లకు కోట్లు వెచ్చించడం ఏంటనే నిరసన వ్యక్తం అవుతోంది. అయితే.. ఇప్పటికిప్పుడు ఏపీ అధికార పార్టీ నేతల ఇమేజ్‌కు వచ్చిన ముప్పేంటని.. దాన్ని మెరుగుపర్చుకోవడానికి ప్రజాధనం ఎందుకు వెచ్చించాలనే ప్రశ్నలూ వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేకత నిర్ణయాలపై ఇటీవలి కాలంలో జాతీయ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. ఆయన పరిపక్వత లేని పాలకుడిగా.. దక్షత లేని నాయకుడిగా మీడియా సంస్థలు విశ్లేషిస్తున్నాయి. అయితే అదే సమయంలో.. జగన్మోహన్ రెడ్డితో దగ్గరి సంబంధాలున్నాయని.. ఆయన మీడియా సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న వారు ఆయనకు పాజిటివ్‌గానే వార్తలు రాస్తున్నారు. దీంతో ఇలా ఢిల్లీ మీడియా సంస్థలకు ఆర్థికంగా ప్రయోజనాలు కల్పించి.. తమ గురించి నెగెటివ్ వార్తలు రాకుండా చూసుకునేందుకు ప్రజాధనాన్ని ఇలా పంచి పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Also Read: ‘స్థానిక’ ఎన్నికలపై జగన్ యూటర్న్

మీడియాలో పాజిటివ్‌ వార్తల కోసం ఇప్పటికే ఎన్డీటీవీకి రూ.ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌ను ఏపీ సర్కార్‌‌ ఇచ్చింది. ఇంగ్లిష్ మీడియంపై ఎన్డీటీవీ సంస్థ స్టేట్ లెవల్ సర్వే చేస్తుందని.. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలపై ఏడు షార్ట్ ఫిల్మ్స్ కూడా తీస్తుందని ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చేసింది. ఈ సర్వేకు..ఈ షార్ట్ ఫిల్మ్స్‌కు ఎంత మొత్తం చెల్లిస్తున్నారో జీవోలో లేదు. మొత్తంగా కోట్లలోనే ఉంటుంది. ఎన్డీటీవీకి ఈ కాంట్రాక్ట్ దక్కిన తర్వాత ప్రభుత్వ ఇమేజ్‌ను బిల్డ్ చేస్తోంది. లాక్‌డౌన్‌ అమలులో ఏపీ నెంబర్ వన్ అనే సర్వేను ప్రసారం చేసింది. మూడు మాస్కులు ఇచ్చేశారని గొప్పగా చెప్పింది. ఇప్పుడు టైమ్స్ఆఫ్ ఇండియాలోనూ ఇలాంటి ఇమేజ్ కోసమే రూ. ఎనిమిది కోట్లు వెచ్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version