https://oktelugu.com/

అమెరికా ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎంత?

మన దేశంలో అయితే డబ్బు చుట్టే రాజకీయాలు తిరుగుతుంటాయి. డబ్బు పెట్టే వారికే టికెట్లు వస్తుంటాయి.. డబ్బు పెట్టిన వారే గెలుస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. అయితే.. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. మరి అక్కడ కూడా డబ్బు ప్రభావం ఉంటుందా అనేది అందరికీ డౌటే. అవును అక్కడ కూడా ఇవే రాజకీయాలు నడుస్తాయంట. Also Read: పాకిస్తాన్ కు సౌదీ షాక్‌..భారత్ కు దీపావళి గిఫ్ట్ కాకపోతే మనదేశంలో డబ్బులు ఖర్చు చేయటానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 29, 2020 / 11:26 AM IST
    Follow us on


    మన దేశంలో అయితే డబ్బు చుట్టే రాజకీయాలు తిరుగుతుంటాయి. డబ్బు పెట్టే వారికే టికెట్లు వస్తుంటాయి.. డబ్బు పెట్టిన వారే గెలుస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. అయితే.. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. మరి అక్కడ కూడా డబ్బు ప్రభావం ఉంటుందా అనేది అందరికీ డౌటే. అవును అక్కడ కూడా ఇవే రాజకీయాలు నడుస్తాయంట.

    Also Read: పాకిస్తాన్ కు సౌదీ షాక్‌..భారత్ కు దీపావళి గిఫ్ట్

    కాకపోతే మనదేశంలో డబ్బులు ఖర్చు చేయటానికి అమెరికాలో చేసే ఖర్చుకు చాలా తేడాలుంటాయి. మన దేశంలో ఎన్నికల ఖర్చు మీద పలు నిబంధనలు ఉంటాయి. కానీ.. అమెరికాలో వ్యయపరిమితి అన్నది లేదు కాబట్టి నిధుల ఖర్చులో ఆకాశమే హద్దుగా ఉంటుంది. అదే సమయంలో వాళ్లు ఖర్చు చేసే ప్రతీ రూపాయికి కచ్చితంగా లెక్కలుంటాయి. మన దగ్గరున్నట్లు చేసే ఖర్చు ఒకటైతే చూపించే ఖర్చు మరోటి అన్న పద్ధతి ఉండదు. మన దగ్గర ఎంపికైతే వ్యయ పరిమితి రూ.75 లక్షలు, ఎమ్మెల్యేకు అయితే రూ.30 లక్షలు దాటకూడదని నిబంధన ఉంది. అయితే.. వాస్తవంగా పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు పరిమితికి మించే ఉంది. ఎందుకంటే ఓ జనరల్ సీటులో ఎంపీగా పోటీ చేయాలంటే కనీసం రూ.150 కోట్లకు పైగా ఖర్చవుతుంది. ఎమ్మెల్యే ఖర్చు తక్కువలో తక్కువ రూ.50 కోట్లు.

    అభ్యర్థులు చూపించే ఖర్చులో నిజం ఏపాటిదో అందరికీ తెలిసిందే. ఇదే అమెరికాలో అయితే ఆ అవసరమే లేదు. ఎన్నికల ఖర్చులకు సంబంధించి తప్పుడు లెక్కలు చూపించాల్సిన అవసరమే ఉండదు. ప్రస్తుత ఎన్నికల్లో మొన్నటి ఆగస్టుకు డెమోక్రాట్ల అభ్యర్థి జో బైడెన్‌కు సుమారు రూ.7 వేల కోట్లు విరాళాల రూపంలో అందాయి. ఇదే సమయంలో అధ్యక్షుడు, మళ్ళీ ఎన్నికయ్యేందుకు కష్టపడుతున్న డొనాల్డ్ ట్రంప్ కు రూ.10 వేల కోట్ల విరాళాలు అందాయి. కాకపోతే ట్రంపునకు వచ్చిన విరాళాల్లో ఎక్కువ భాగం ఖర్చయిపోవటంతో ఇబ్బందులు పడుతున్నాడట. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో దీని ప్రభావం పడవచ్చని అనుకుంటున్నారు.

    Also Read: అవినీతిపై మోడీ యుద్ధం చేస్తారా?

    అధ్యక్ష అభ్యర్ధుల ఎన్నికల ఖర్చంతా టీవీల్లో డిబేట్లు, పాంప్లెట్లు, మీడియాలో ప్రకటనలు, పెద్ద పెద్ద హోర్డింగులు, పబ్లిక్ మీటింగులు, ప్రముఖులతో డిన్నర్ సమావేశాలు తదితరాల రూపంలో ఉంటాయి. ఏ పార్టీ అభ్యర్ధికి ఏ రూపంలో విరాళాలు అందుతున్నాయనే విషయం కూడా స్పష్టం చేయాల్సి ఉంటుంది. అంతా క్లారిటీతోనే జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి నిధుల విరాళాలు ఇచ్చే విషయంలో కానీ ఖర్చు పెట్టే విషయంలో కానీ ఎలాంటి ఇబ్బందులు, దాపరికాలుండవు. అందుకే అమెరికాలో మొత్తం ట్రాన్స్ పరెంట్‌గానే ఉంటుంది. మరి మనదగ్గర ఈ పరిస్థితి ఎప్పుడు వస్తుందో ..? అసలు ఆ పరిస్థితి వస్తుందా అని ఊహించగలమా.