ఆరోపణలు రుజువు చేస్తావా … రాజీనామా చేస్తావా కన్నా!

కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలు వ్యవహారంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ చేస్తున్న ఆరోపణలపై కొద్దీ రోజులుగా ఎదురు దాడులు జరుపకుండా మౌనం వహిస్తున్న వైసిపి నేతలు తిరిగి తమ దాడిని ప్రారంభించారు. ఈ సారి నేరుగా రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రంగంలోకి దిగారు. జగన్ కి థాంక్స్ చెప్పిన పవన్! ఆరోపణలను రుజువు చేస్తే రేపు ఉదయం 9.30 గంటల కల్లా మంత్రి పదవికి తాను రాజీనామా చేస్తానని స్పష్టం […]

Written By: Neelambaram, Updated On : May 1, 2020 6:42 pm
Follow us on


కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలు వ్యవహారంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ చేస్తున్న ఆరోపణలపై కొద్దీ రోజులుగా ఎదురు దాడులు జరుపకుండా మౌనం వహిస్తున్న వైసిపి నేతలు తిరిగి తమ దాడిని ప్రారంభించారు. ఈ సారి నేరుగా రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రంగంలోకి దిగారు.

జగన్ కి థాంక్స్ చెప్పిన పవన్!

ఆరోపణలను రుజువు చేస్తే రేపు ఉదయం 9.30 గంటల కల్లా మంత్రి పదవికి తాను రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. రుజువు చేయలేని పక్షంలో తన పదవికి కన్నా రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు.

కరోనా టెస్టింగ్ కిట్లను తాను సరఫరా చేసినట్లు కన్నా ఆరోపించడం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఇంత వయసొచ్చిన ఆయన ఇలా మాట్లాడటం సరైంది కాదని మంత్రి కన్నాకు హితవు చెప్పారు. కన్నా తన వయసుకు, బాధ్యతకు తగిన విధంగా మాట్లాడాలని హితవు చెప్పారు.

తనకు కంపెనీ ఉండి.. దాని ద్వారా కిట్లను సరఫరా చేసినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని మంత్రి సవాల్ చేశారు. పైగా, రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదని, రాజకీయం చేయడానికి ఇంకా సమయం ఉందని, ఇలాంటి సమయంలో అందరం కలిసికట్టుగా కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేయాలని మంత్రి బుగ్గన పిలుపు ఇచ్చారు.

పంట వేసేటప్పుడే ధర…ఏపీ నూతన విధానం…!

ప్రభుత్వం పరంగా ఏమైనా తప్పులు జరిగితే తగిన సలహాలు, సూచనలు చేయాలని, విమర్శలు చేయకూడదని మంత్రి పేర్కొన్నారు. కరోనా పరీక్షలు నిర్వహించడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రి గుర్తు చేశారు.

ఇదివరలో టెస్టింగ్ కిట్ల కొనుగోలు వ్యవహారంపై ట్వీట్ ఇచ్చిన కన్నా ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు నుండి రూ 20 కోట్లు ముడుపులు తీసుకొని ఆ విధమైన ఆరోపణలు చేస్తున్నారని వైసిపి ఎంపీ వి విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపడం తెలిసిందే.

వారం రోజులపాటు సాగిన ఆ దుమారం సద్దుమణగగా, తిరిగి కన్నా కిట్ల కొనుగోలుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ గవర్నర్ కు లేఖ వ్రాయడంతో మూడు రోజలపాటు మౌనంగా ఉన్న వైసిపి నేతలు నేడు తీవ్రంగా స్పందించారు.