కరోనా దెబ్బ హాలీవుడ్ బాగా గట్టిగానే తగిలింది. ఇప్పటికే సుమారు పదిమంది నటులు కరోనా బారినపడి మరణించారు. ఇపుడు తాజాగా కరోనా సోకిన హాలీవుడ్ నటుడు నిక్ కార్డేరో.. చివరకు తన కాలును కూడా కోల్పోవాల్సి వచ్చింది. 42 ఏళ్ళ నిక్ కార్డేరో ఏప్రిల్ 2 వ తారీఖున హాస్పిటల్ లో జాయిన్ అయ్యి 16 రోజుల తరవాత ఏప్రిల్ 18 వ తారీఖున కుడి కాలుని కోల్పోవాల్సి వచ్చింది .
కేటీఆర్ పిలుపుకు స్పందించిన కవిత
కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన నిక్ కార్డేరో లాస్ ఏంజెలెస్ లోని’ సెడార్స్ -సినాయ్ మెడికల్ సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కరోనా కారణంగా అతను తీవ్ర ఇన్ఫెక్షన్ కు గురయ్యాడు. దీంతో అతని కుడి కాలి రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టి, ముక్కలుగా విడిపోయింది. ఇది ఊపిరితిత్తులకు చేరితే ప్రాణాలకే ముప్పు సంభవించే అవకాశం ఉంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అతని కాలును ఏప్రిల్ 18 న అతని కాలును వైద్యులు తొలగించారు. కాగా ఈ విషయాలన్నీ నిక్ కార్డేరో భార్య అమండా క్లూట్స్ ప్రముఖ ఇంగ్లీష్ వార్తా సంస్థ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పేర్కొనడం జరిగింది .