Union Budget 2025: కేంద్ర ప్రభుత్వం 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెడుతోంది. ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ వరుసగా 8వసారి బడ్జెట్ ప్రవేశపెడుతుఆన్నరు. విపక్షాల నిరసనల మధ్య శనివారం(ఫిబ్రవరి 1న) మంత్రి బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టారు. దీంతో విపక్షాలు కొద్దిసేపు నిరసన తెలిపి శాంతించాయి. ప్రస్తుతం బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది.
బడ్జెట్లో ముఖ్యాంశాలు..
– వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 75 వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
– రూ.30 వేల పరిమితితో పట్టణ పేదల కోసం యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు జారీ చేయనుంది.
– అంతర్రాష్ట్ విద్యుత్ పంపిణీ కోసం కొత్త ప్రణాళిక
– బిహార్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టుల ఏర్పాటు
– దేశంలోని 50 పర్యాటక ప్రదేశాల్లో ప్రత్యేక అభివృద్ధి
– సంస్కరణలు అమలు చేసే రాస్ట్రాలకు ప్రత్యక నిధులు
– అణుశక్తి చట్టానికి సవరణలు, ప్రైవేటు రంగానికి అవకాశం
– మధ్య తరగతి ప్రజల కోసం 40 వేల ఇళ్లు,
– వికసి™Œ భారత్ కోసం న్యూక్లియర్ ఎనర్జీ మిషన్
– ఉపాధి కల్పన దిశగా పర్యాటక రంగం అభివృద్ధి
– కొత్తా 117 ప్రాంతాలకు విమాన సర్వీసులు
– మూల ధన వ్యయానికి వడ్డీ లేకుండా రూ.1.50 లక్షల కోట్లు.
– పర్యాటక ప్రదేశాలకు రవాణా సౌకర్యం మెరుగు
– 2028 వరకు జల్ జీవన్ మిషన్ పథకం పొడిగింపు
– యువత నైపుణ్య శిక్షణ కోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు
– భూ రికార్డుల డిజిటలైజేషన్‌కు అధిక ప్రాధాన్యం.
– గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా, కోటి మందికి ప్రయోజనం
– ఐదు ఐఐటీ ఆధునికీకరణ
– ఏఐ రంగంలో సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు
– పీఎం జన్ ఆరోగ్య బీమా కింద పేదలకు బీమా. ఇందుకు రూ.10 వేల కోట్లు
– వచ్చే వారం నూతన ఆదాయ పన్ను బిల్లు
– ఎస్సీ, ఎస్టీ మహిళా వ్యాపార వేత్తల రుణ పరిమితి రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంపు
– లెదర్, ఫుట్‌వేర్ సెక్టార్ అభివృద్ధికి చర్యలు
– రూ.8 కోట్లతో పిల్లలకు పౌష్టికాహారం
– గ్రామీణ ప్రాథమిక పాటశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం.
– మేక్ఇన్ ఇండియా పథకం కింద బొమ్మల తయారీకి ప్రోత్సాహం.
– అన్ని జిల్లా ఆస్పత్రుల్లో క్యాన్సర్ డేకేర్ సెంటర్లు
– 2047 నాటికి 100 మెగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి.
– ఏఐ అభివృద్ధికి రూ.100 కోట్లతో మూడు కేంద్రాలు
– బీమారంగంలో వంద శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి.
– క్యాన్సన్, ప్రాంణాతక వ్యాధుల మందులపై కస్టమ్స్ డ్యూటీ వంద శాతం ఎత్తివేత. – 36 రకాల మందులపై కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేత
– రెవెన్యూ లోటు అంచనా 4.8 శాతం
– బిహారల్లో ప్రజల కోసం మకానా బోర్డు ఏర్పాటు
– పత్తి ఉత్పత్తి పెంచేందుకు ఐదేళ్లలో ప్రత్యేక మిషన్
– ప్రైవేటు బాగస్యామ్యంతో మెడికల్ టూరిజం అభివృద్ధి
– బిహార్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ పార్కు
– త్వరలో జన విశ్వాస్ 2.0
– పీపీపీ ద్వారా రాష్ట్రాలకు 1.50 లక్షల రుణాలు
– నగరాల అభివృద్ధికి రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి
– లిథియం బ్యాటరీల తయారీపై పన్ను ఎత్తివేత
– మూల ధన వ్యయం రూ.10.1 లక్షల కోట్లు
– తగ్గనున్న ఎల్ఈడీ, ఎల్సీడీ టీవీలు, ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు
– తగ్గనున్న బ్యాటరీ వాహనాలు ధరలు.