యడియూరప్ప వివాహం హాజరుపై దుమారం!

దేశంలో కరోనా వైరస్ మొదటి మరణం బెంగుళూరులో జరగడమే కాకుండా, ఈ వైరస్ పట్ల అక్కడి ప్రభుత్వం తొలుత నిర్లక్ష్యం వహించడంతో విస్తృతంగా వ్యాప్తి చెందిన్నట్లు ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప ఒక వివాహానికి హాజరు కావడం, ఆ వివాహం ఏర్పాట్లు అంగరంగ వైభవంగా ఉండడంతో కరోనా జాగ్రత్తలు గురించి ప్రజలకు చెప్పడమే గాని ప్రభుత్వంలోని ప్రముఖులకు అవి వర్తింపవా అనే దుమారం చెలరేగింది. పైగా ఆ వివాహం బీజేపీ ఎమ్మెల్సీ, మండలి […]

Written By: Neelambaram, Updated On : March 17, 2020 1:01 pm
Follow us on

దేశంలో కరోనా వైరస్ మొదటి మరణం బెంగుళూరులో జరగడమే కాకుండా, ఈ వైరస్ పట్ల అక్కడి ప్రభుత్వం తొలుత నిర్లక్ష్యం వహించడంతో విస్తృతంగా వ్యాప్తి చెందిన్నట్లు ఆరోపణలు ఎదురవుతున్నాయి.

ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప ఒక వివాహానికి హాజరు కావడం, ఆ వివాహం ఏర్పాట్లు అంగరంగ వైభవంగా ఉండడంతో కరోనా జాగ్రత్తలు గురించి ప్రజలకు చెప్పడమే గాని ప్రభుత్వంలోని ప్రముఖులకు అవి వర్తింపవా అనే దుమారం చెలరేగింది.

పైగా ఆ వివాహం బీజేపీ ఎమ్మెల్సీ, మండలి చీఫ్‌ విప్‌ మహంతేశ్‌ కవాటగిమత్‌ కుమార్తెది కావడం, అతిధులు పెద్ద ఎత్తున రావడంతో వివాదం రేగింది.

ఎగ్జిబిషన్లు, సమ్మర్‌ క్యాంపులు, సమావేశాలు, పెళ్లిళ్లు, ఎంగేజ్‌మెంట్లు, క్రీడా ఈవెంట్లు ఇలా అన్నీ వాయిదా వేసుకోవాలని ఆదేశించిన ముఖ్యమంత్రి.. ఇలా ఆడంబరంగా జరిగే వివాహానికి రావడం దేనికి సూచిస్తుందని ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. నిబంధనలు ప్రజలకు మాత్రమేనా.. నాయకులకు ఉండవా అని మండిపడుతున్నారు.

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మాల్స్‌, సినిమా హాళ్లు, పబ్బులు, క్లబ్బులు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అదే విధంగా జనసమ్మర్ధం ఉన్న చోటకు వెళ్లరాదని.. పెళ్లిళ్లను వాయిదా వేసుకోవాలని.. అలా కుదరని పక్షంలో కేవలం 100 మంది కంటే తక్కువ అతిథుల మధ్య తంతు జరిపించాలని ఆదేశించింది. అటువంటి ఆదేశాలు ముఖ్యమంత్రికి, అధికార పక్షం వారికి వర్తింపవా అని జనం నిలదీస్తున్నారు.