రమేష్ కుమార్ తొలగింపుకు రంగం సిద్ధం?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని వ్యవహార శైలిపై సీఎం జగన్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకున్న విచక్షణా అధికారాన్ని దుర్నివియోగం చేస్తున్నారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రమేష్ కుమార్ ని తొలగించే పనిలో జగన్ సర్కార్ ఆలోచిస్తోంది. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు 6వారాల పాటు వాయిదా వేయడాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు జగన్. ఈ మేరకు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, […]

Written By: Neelambaram, Updated On : March 17, 2020 2:26 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని వ్యవహార శైలిపై సీఎం జగన్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకున్న విచక్షణా అధికారాన్ని దుర్నివియోగం చేస్తున్నారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రమేష్ కుమార్ ని తొలగించే పనిలో జగన్ సర్కార్ ఆలోచిస్తోంది. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు 6వారాల పాటు వాయిదా వేయడాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు జగన్.

ఈ మేరకు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం పేషీలోని ఉన్నతాధికారులతో సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఎన్నికల సంఘం పరిధి, అధికారాలు, ప్రభుత్వానికి ఎంతవరకు అజమాయిషీ ఉంటుందన్న అంశంపై చర్చించారు. రాజ్యాంగంలోని 243కే అధికరణం ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంక్రమించిన అధికారులపై ఈ సమీక్షలో చర్చించారు. సీఎం జగన్ అడ్వకేట్ జనరల్, సుప్రీం కోర్టు న్యాయ నిపుణులతో కూడా చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు తొలుత సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. కోర్టులో ఫలితం సానుకూలంగా రాకపోతే రాబోయే వారం రోజుల్లో సంచలనమైన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం పట్ల వివక్షతో వ్యవహరించి, రాష్ట్ర ప్రయోజనాలను ఎన్నికల సంఘం దెబ్బతీసినందున ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఆ పదవి నుంచి తొలగించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డికి ఈ బాధ్యతను జగన్ అప్పగించినట్టు సమాచారం.

అసెంబ్లీలో అభిశంసన బిల్లు పెట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి రమేష్ కుమార్ ను తొలగించేందుకు సిద్ధమవ్వాలని సీఎం జగన్ నిర్ణయించినట్టు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు వారం రోజుల్లోగా పరిస్థితులను చూసి అసెంబ్లీని సమావేశ పరిచి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో పాటు ఈ అభిశంసన బిల్లు పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.