MIM vs BRS : పైకి ఎంఐఎంతో పంచాయితీ.. నేషనల్‌ లెవల్‌లో బీఆర్‌ఎస్‌ పాలి‘ట్రిక్స్‌’!

MIM vs BRS : తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌ మిత్రపక్షంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పే ఎంఐఎస్‌ శాసన సభాపక్షనేత అక్బరుద్దీన్‌. ముఖ్యమైన మంత్రి కె.తారకరామారావుతో అసెంబ్లీ వేదికగా సై అంటే సై అన్నట్లుగా వాగ్వాదానికి దిగారు. తీవ్రస్థాయిలో జరిగిన వాగ్వాదం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీకి రావడం లేదని అక్బరుద్దీన్‌ అధికార పక్షాన్ని నిలదీయడం ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌కు కోపం తెప్పించింది. అంతే కాకుండా అక్బరుద్దీన్‌ తన స్థాయిని సీఎం కేసీఆర్‌ స్థాయితో పోల్చుకోవడం […]

Written By: NARESH, Updated On : February 5, 2023 4:25 pm
Follow us on

MIM vs BRS : తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌ మిత్రపక్షంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పే ఎంఐఎస్‌ శాసన సభాపక్షనేత అక్బరుద్దీన్‌. ముఖ్యమైన మంత్రి కె.తారకరామారావుతో అసెంబ్లీ వేదికగా సై అంటే సై అన్నట్లుగా వాగ్వాదానికి దిగారు. తీవ్రస్థాయిలో జరిగిన వాగ్వాదం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీకి రావడం లేదని అక్బరుద్దీన్‌ అధికార పక్షాన్ని నిలదీయడం ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌కు కోపం తెప్పించింది. అంతే కాకుండా అక్బరుద్దీన్‌ తన స్థాయిని సీఎం కేసీఆర్‌ స్థాయితో పోల్చుకోవడం అధికార పక్షానికి మింగుడు పడలే దు. దీంతో కేటీఆర్‌ కోసం అరికాలి నుంచి నశాలానికి ఎక్కింది. సభా నాయకుడితో అక్బరుద్దీన్‌కు ఏం పని అని ప్రశ్నించారు. కేవలం ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న మజ్లిస్‌కు మాట్లాడేందుకు అంత సమయం ఇవ్వడం ఏమిటని ఏకంగా స్పీకర్‌నే ప్రశ్నించారు.

చలో చూసుకుందా..
కేటీఆర్‌ వ్యంగంగా చేసిన వ్యాఖ్యలతో అక్బరుద్దీన్‌ కూడా ఫీలయ్యారు. తమను ఏడుగురు ఎమ్మెల్యేలు అంటున్నారని.. దీన్ని చాలెంజ్‌ గా తీసుకుంటామని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. దీంతో ఉలిక్కి పడటం బీఆర్‌ఎస్‌ నేతల వంతయింది. గత ఎన్నికల్లో కేసీఆర్‌కు మజ్లిస్‌ పరోక్ష సహకారం ఎంతో లభించింది. ఎనిమిది చోట్ల తప్ప మజ్లిస్‌ ఇతర చోట్ల పోటీ చేయలేదు. అన్ని చోట్లా బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని పరోక్షంగా తమ వర్గానికి సంకేతాలు పంపింది. దీంతో ముస్లింలు ఎక్కువగా ఉన్నచోట బీఆర్‌ఎస్‌ విజయం సులువైంది. అయితే ఇటీవలి కాలంలో తమ పార్టీని విస్తరించాలనుకుంటున్న మజ్లిస్‌ మరికొన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది.

ఎంఐఎం పోటీ చేసేది అక్కడే..
వచ్చే అసెంబ్లీల ఎన్నికల్లోల 50 సీట్లలో పోటీ చేస్తామని అక్బరుద్దీన్‌ ప్రకటించడంతో గులాబీ నేతల్లో చర్చ మొదలైంది. ఎక్కడెక్కడ పోటీ చేయవచ్చని అంచనాలు, లెక్కలు వేసుకుంటున్నారు. పాతబస్తీతోపాటు రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్, బోధన్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్‌ లాంటి చోట్ల అభ్యర్థుల్ని నిలబెట్టే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

అసద్‌ భాయ్‌దే తుది నిర్ణయం..
అసెంబ్లీలో కేటీఆర్‌ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలతో తాము 50 స్థానాల్లో పోటీచేస్తామని అక్బర్‌ ప్రకటించారు. కానీ బీఆర్‌ఎస్, మజ్లిస్‌ పార్టీల నిర్ణయాలు కేటీఆర్, అక్బర్‌ చేతుల్లో ఉండవు. కేసీఆర్, అసదుద్దీన్‌ చర్చించుకుని రాజకీయ వ్యూహాలు ఖరారు చేస్తారు. అసదుద్దీన్‌ తానుత్యాగం చేయడానికి ఎప్పుడూ ముందుకురారు. తన అవసరం ఉందని ఇతర పార్టీలు అనుకుంటేం గరిష్టంగా ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తారు. అందుకే.. ఇప్పుడు అక్బర్‌ ప్రకటనతో ముందు ముందు బీఆర్‌ఎస్‌కు క్లిష్ట పరిస్థితులు ఏర్పడవచ్చని చెబుతున్నారు. అయితే ఇది బీఆర్‌ఎస్‌ బాస్‌ నేషనల్‌ పాటిక్స్‌లో భాగమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.