BRS Party : పార్టీలు మనుగడ కోసం, కార్యక్రమాల నిర్వహణ కోసం విరాళాలు స్వీకరిస్తాయి. పార్టీ కార్యకర్తల నుంచి సభ్యత్వం రూపొంలో నిధులు సమకూర్చుకుంటాయి. ఇక కొందరు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, అభిమానులు, ఎన్నారైలు కూడా పార్టీలకు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తుంటారు. ఇలా సేకరించిన నిధులతో పార్టీలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విరాళాల వివరాలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వెల్లడయ్యాయి. అత్యధిక విరాళాలతో బీజేపీ దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఆశ్చర్యకరంగా అధికారంలో లేని ఓ ప్రాంతీయ పార్టీ దేశంలో విరాళాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఈసీ వివరాలను వెబ్‌సైట్‌లో పేర్కొంది. బీఆర్‌ఎస్‌కు ఊహించని విధంగా విరాళాలు అందాయి. ఇక విరాళాలు పొందే విషయంలో జాతీయ పార్టీల విషయానికి వస్తే బీజేపీ మొదటిస్థానంలో ఉండగా, జాతీయ కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది.
ఈసీ నివేదిక ప్రకారం..
భారత ఎన్నికల కమిషన్ నివేదిక ప్రకారం.. 2023–24లో దాతలు బీజేపీకి 20 వేలకన్నా ఎక్కువ మొత్తంలో దాదాపు రూ.2,244 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తం 2022–23లో అందుకున్న మొత్తానికి మూడు రెట్లు ఎక్కువ. ఇక భారత రాష్ట్ర సమితి రూ.580 కోట్లతో దేశంలోనే అత్యధిక విరాళాలు పొందిన రెండో పార్టీగా నిలిచింది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కేవలం రూ.289 కోట్లతో మూడోస్థానంలో ఉంఇ. కాంగ్రెస్‌కు గతేడాది 20 వేలు అంతకన్నా ఎక్కువ విరాళాల రూపొంలో రూ.79.9 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ మొత్తం కన్నా కాంగ్రెస్ కన్నా బీజేపీకి 776.82 శాతం ఎక్కువ విరాళాలు అందాయి.
జాతీయ పార్టీలకు ఎక్కువ..
ట్రస్ట్‌లు జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్‌కు ఎక్కువగా విరాళాలు అందించాయని ఎన్నికల సంఘం డేటా చెబుతోంది. అందులో బీజేపీకి రూ.723 కోట్లు రాగా, కాంగ్రెస్‌కు రూ.156 కోట్లు ఫ్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ విరాళంగా ఇచ్చింది. ఇక ఇతర పార్టీల విషయానికి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి 2023–24 సంవత్సరానికి రూ.11.1 కోట్ల విలువైన విరాళాలు అందాయి. గతేడాది ఆప్‌కు రూ.37.1 కోట్ల విరాళాలు వచ్చాయి. ఈ ఏడాది బాగా తగ్గిపోయాయి. ఇక సీపీఎం 2022–23లో రూ.6.1 కోట్లు విరాళం పొందగా, ఈ ఏడాది రూ.7.6 కోట్లు పొందింది.
కోర్టు తీర్పుతో వివరాలు బహిర్గతం..
ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించే అవసరం లేదని గతంలో కేంద్రం తెలిపింది. కానీ, ఈ విషయంపై విపక్షాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. విరాళాల వివరాలు రహస్యంగా ఉంచడం ఎందుకని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. వివరాలు వెల్లడించాలని ఈసీని ఆదేశించింది. దీంతో ఈసీ ఈ ఏడాది పార్టీకి వచ్చిన వివరాలను వెల్లడించింది. ఈమేరక వెబ్‌సైట్‌లో పొందుపర్చింది.