Anaganaga Ok Raju Teaser Review: ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు నవీన్ పోలిశెట్టి. 2021లో జాతిరత్నాలు మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ మూవీ విడుదలైన రెండేళ్లకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం చేశాడు. అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం విడుదలై ఏడాది దాటిపోయింది. ఆయన ఫ్యాన్స్ లేటెస్ట్ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. కాగా అమెరికాలో నవీన్ పోలిశెట్టికి ప్రమాదం జరిగినట్లు సమాచారం. గాయాల నుండి కోలుకోవడానికి సమయం పట్టింది.
ఎట్టకేలకు తన కొత్త మూవీపై అప్డేట్ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి. అనగనగా ఒక రాజు మూవీ నుండి ప్రోమో విడుదల చేశారు. ప్రీ వెడ్డింగ్ వీడియో పేరుతో ఈ ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో నవీన్ పోలిశెట్టి నేరుగా అపర కుబేరుడు ముఖేష్ అంబానీతో ఫోన్ లో మాట్లాడటం విశేషం. అనంత్ అంబానీ పెళ్లి గురించి మాట్లాడుతూ కామెడీ పంచాడు. పైగా ముఖేష్ అంబానీ నవీన్ శెట్టికి మామయ్య అవుతాడట. పెళ్లి బట్టల్లో నవీన్ పోలిశెట్టి లుక్ ఆకట్టుకుంది.
ఇక ప్రోమో చూస్తే… నవీన్ పోలిశెట్టి మార్క్ కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. నవీన్ పోలిశెట్టికి జంటగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అలాగే సాయి సౌజన్య నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. అనగనగా ఒక రాజు చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
అనగనగా ఒక రాజు మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. మారి దర్శకత్వం వహిస్తున్నారు. విడుదల తేదీ ప్రకటించలేదు. మొత్తంగా టీజర్ అంచనాలు పెంచేసింది. ఈ మూవీ ప్రకటించి చాలా కాలం అవుతుంది. మీరు కూడా ఒక లుక్ వేయండి. నవీన్ పోలిశెట్టి ఫ్యాన్స్ కి అనగనగా ఒక రాజు ఫీస్ట్ కానుంది.