Homeజాతీయ వార్తలుFans Warning to Vijay: విజయ్ అన్నా.. త్రిష తో జాగ్రత్త.. ధర్మ యోగిని గుర్తుపెట్టుకో..

Fans Warning to Vijay: విజయ్ అన్నా.. త్రిష తో జాగ్రత్త.. ధర్మ యోగిని గుర్తుపెట్టుకో..

Fans Warning to Vijay: ఎవరైనా అనుకున్నారా.. కనీసం కలలోనైనా ఊహించరా.. తమిళనాడు రాజకీయాలలో విజయ్ సీఎం అవుతారని.. తమిళనాడులో టీవీకే పార్టీ ఘన విజయం సాధిస్తుందని.. రాజకీయాలలో మనం అనుకున్నవి జరగవు. మనం అనుకోనివే జరుగుతాయి. అందువల్లే రాజకీయాలను యాదృచ్ఛికానికి.. అనిశ్చితికి మారుపేరు అని విశ్లేషకులు చెబుతుంటారు. రాజకీయాలలో సంచలనాలు మాత్రమే కాదు.. అప్పుడప్పుడు అంచనా వేయలేని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి.

తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల ఫలితాలలో అవి అడుగడుగునా కనిపించాయి. తమిళనాడులో ఈసారి ఓటర్లు ఏ రాజకీయ పార్టీకి వన్ సైడ్ విక్టరీ అందించలేకపోయినప్పటికీ.. అధికార డీఎంకేకు మాత్రం చుక్కలు చూపించారు. అన్న డీఎంకేకు ఒక మోస్తరు స్థానాలు అందించారు. అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించే విధంగా చేశారు. అయితే అధికారాన్ని దక్కించుకోవడానికి టీవీకేకు ఇంకా ఆరు స్థానాలు కావాలి. ఆస్థానాలను అన్న డీఎంకే నుంచి తీసుకుంటామని.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని ఇప్పటికే విజయ్ ప్రకటించారు. ఈ ప్రకారం తమిళనాడులో కొత్త రాజకీయ శకం ఆరంభం కాబోతోంది. ఎంజీఆర్ తర్వాత.. జయలలిత తర్వాత.. సినిమా రంగంతో సంబంధం ఉన్న వ్యక్తి తమిళనాడుకు ముఖ్యమంత్రి కాబోతున్నారు.

విజయ్ రాజకీయ ఎదుగుదల విషయంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల వెనుక త్రిష ఉన్నారనేది నిర్వివాదం. ఎందుకంటే కొంతకాలంగా త్రిషకు, విజయ్ కి సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల విజయ భార్య సంగీత బయటపెట్టారు. ఆమె విడాకుల నోటీసులు కూడా పంపించారు. ఇప్పుడు ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. విజయ్ విజయం సాధించిన తర్వాత త్రిష తిరుమల నుంచి నేరుగా ఆయన ఇంటికి వెళ్లారు. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఆయనకు అందించారు. గంటన్నర పాటు విజయ్ తో చర్చలు జరిపారు. విజయ్ రెండు నియోజకవర్గాలలో విజయం సాధించిన నేపథ్యంలో.. ఒక నియోజకవర్గానికి రాజీనామా చేసి.. అక్కడి నుంచి త్రిషను పోటీ చేయించే అవకాశం ఉంది. తమిళ మీడియాలో ఇవే వార్తలు వస్తున్నాయి.

త్రిష విజయ్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి. అందులో ఒక అంశం మాత్రం ఆసక్తికరంగా ఉంది. కెరియర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు త్రిష అనేక రకాలైన పాత్రలను పోషించింది. అందులో ధనుష్ తో నటించిన ధర్మ యోగి అనే సినిమా మాత్రం త్రిష కెరియర్ లోనే విభిన్నమైన చిత్రం. ఎందుకంటే ఈ సినిమాలో త్రిష పూర్తి నెగిటివ్ షెడ్ లో ఉన్న పాత్రలో నటించారు. ఈ సినిమా మొత్తం రాజకీయ అంశాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. త్రిష తన రాజకీయ ఎదుగుదల కోసం ధనుష్ తో ప్రేమ నటిస్తుంది. ఆ తర్వాత అతడిని చంపేస్తుంది. ధనుష్ తమ్ముడు త్రిషను అంతం చేయడంతో ఈ సినిమా కథ ముగుస్తుంది.

ఇప్పుడు విజయ్ తో అంట కాగుతున్న త్రిష.. రేపటినాడు అదే పని చేస్తుందని.. అందువల్లే ఆమెతో జాగ్రత్తగా ఉండాలని విజయ్ అభిమానులు సూచిస్తున్నారు.. గతంలో త్రిష ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ముఖ్యమంత్రి కావాలని ఉందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో త్రిష తను సీఎం అవ్వడానికి ఏ పనైనా చేస్తుందని.. అందువల్ల విజయ్ జాగ్రత్తగా ఉండాలని ఆయన అభిమానులు హెచ్చరిస్తున్నారు.
Trisha's betrayal| Kodi | Sun NXT | Shorts

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version