British Rule In Tirumala: దేశ, విదేశాల్లోని భక్తులు నిత్యం కొలిచే దైవం తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి. జీవితంలో ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకోవాలని చాలా మంది ఆరాటపడుతూ ఉంటారు. అందుకే ఎన్ని పనులున్నా ఒక్కసారైనా తిరుపతికి వచ్చి వెళ్తుంటారు. ఆకాశంలోకి రాకెట్లను పంపించే శాస్త్రవేత్తలు సైతం శ్రీవారికి సమర్పించిన తరువాతే కార్యక్రమాన్ని మొదలుపెడుతారంటే ఆ స్వామి మహత్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే తిరుపతిలో కొన్ని సాంప్రదాయాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇక్కడు శుచి, శుభ్రతకు విలువ ఇస్తారు. మాడవీధుల్లో ఎక్కడ చూసినా మానకు చెత్త కనిపించదు. భక్తులకు పంచింపెట్టే ప్రసాదాన్ని రాగి గంగాళంలో తీసుకొస్తారు. ముందుగా వీటిని స్వామి వారికి అందించిన తరువాత భక్తులకు ఇస్తారు. అయితే ప్రసాదాన్ని రాగి గంగాళం నుంచే ఎందుకు పంచుతారని చాలా మందికి సందేహం ఉంది. అయితే ఈ రాగి గంగాళానికి, ఓ బ్రిటిషర్ కు సంబంధం ఉంది. ఆ కథ వివరాల్లోకి వెళితే.
ఇటీవల సోషల్ మీడియాలో ఓ కథనం బాగా వైరల్ అవుతోంది. ‘వి’ బ్లాగ్ అనే కథనం ప్రకారం.. భారతదేశాన్ని బ్రిటిషర్లు పాలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాలకు అప్పట్లో కలెక్టర్లను నియమించేవారు. 1821లో మన్రో అనే వ్యక్తిని రాయలసీమ ప్రాంతానికి కలెక్టర్ గా నియమించారు. తన పరిధిలో తిరుపతి దేవాలయం ఉన్నందున.. ఒకసారి వెళ్లి చూడాలని నిర్ణయించుకున్నాడు. అక్కడికి వెళ్లిన మన్రో భక్తులు చేత్తో ప్రసాదం తినడం చూశాడు. ఇలా పరిశుభ్రత లేకుండా ప్రసాదం తినడం ద్వారా కలరా వ్యాధి వస్తుందని వారిని హెచ్చరించాడు. అంతేకాకుండా వారి చేతుల్లో ఉన్న ప్రసాదాన్ని తన అనుచరులతో కింద పడేయించాడు. అంతేకాకుండా అప్పటి నుంచి ఇక నుంచి ఎవరూ ప్రసాదం తినకూడదని ఆర్డర్ వేశాడు.
కొన్ని రోజుల తరువాత మన్రోకి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. ఎంతమంది వైద్యులు చికిత్స చేసినా తగ్గలేదు. ఇదే సమయంలో మంత్రాలయం వెళ్లి పన్నులు వసూలు చేయాలని మద్రాస్ ప్రభుత్వం మన్రోను ఆదేశించింది. దీంతో ఆయన మంత్రాలయం వెళ్లాడు. ఆలయంలోకి వెళ్లిన మన్రోకి ఒక రుషి ఇంగ్లీషులో మఠం గురించి చెబుతూ కనిపించాడు. అయితే ఆయన మన్రోకు మాత్రమే కనిపించాడు. మన్రో ఆయనను తదేకంగా చూడడం చూసి మిగతా వారు ఆశ్చర్యపోయారు. అప్పటికే 100 సంవత్సరాల కిందట మరణించిన రాఘవేంద్రస్వామినే తనకు కపించాడిన మన్రో అనుకుని ఆయనకు భక్తుడిగా మారాడు.
అలా కొన్ని రోజుల పాటు రాఘవేంద్ర స్వామిని తలుచుకుంటూ ఉండగా ఒకరోజు తన దగ్గరికి ఓ స్వామి వచ్చాడు. తన కడుపునొప్పికి కారణం చెప్పాడు. తిరుమలలో నీవు చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నావ్ నాయనా.. అని చెప్పాడు. నీవు చేసిన తప్పుకు తిరుమలకు వచ్చే భక్తులు ఆహారం లేక అల్లాడుతున్నారని అన్నారు. దీంతో వెంటనే తిరుమలకు వెళ్లిన మన్రో తిరుపతి ప్రసాదాన్ని చేత్తో తిన్నాడు. దీంతో అతని కడుపు నొప్పి తగ్గింది. అంతేకాకుండా అప్పటి నుంచి ప్రసాదాన్ని పంపిణీ చేయాలని ఆర్డర్ వేశాడు. అయితే అప్పుడు కలరా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రసాదాన్ని రాగి గంగాళం నుంచి పంపిణీ చేయాలని సూచించాడు.
అయితే మన్రో చేసిన పనులకు గుర్తుగా మన్రో పేరుతో ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అంతేకాకుండా తిరుపతిలో ఓ చోట ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి రాగి గంగాళంలో ఇప్పటి వరకు ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. అయితే మన్రో కలరా రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఆయనే చివరికి కలరా వ్యాధితో మరణించాడు. ఇదీ బ్రిటిషన్ మన్రో కథ.