https://oktelugu.com/

Baby Collections: ‘బేబీ’ కలెక్షన్ల సునామీ.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకవుతారు..

ఆనంద్ దేరకొండ,సాయి రాజేశ్వర్, విష్ణచైతన్యలు ప్రధానంగా నటించిన సినిమా ‘బేబీ’ జూలై 14న రిలీజ్ అయింది. సాయి రాజేశ్వర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ కథాంశం బాగా ఆకట్టుకుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : August 7, 2023 / 12:24 PM IST

    Baby Collections

    Follow us on

    Baby Collections: గత కొంతకాలంగా లవ్ ఎమోషన్ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ జూలైలో రిలీజ్ అయినా ‘బేబీ’ మూవీ ప్రతి ఒక్కరిని చూసేలా చేసింది. యూత్ మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారు ఈ సినిమాలో ఇంతలా ఏముంది? అని చూసేందుకు థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. సినిమా రిలీజై 24 రోజులు గడిచినా ఇంకా ఈ మూవీ హవా తగ్గడం లేదు. ఫస్ట్ వీక్ లోనే కలెక్షన్లతో అదరగొట్టిన బీబీ ఇప్పటి వరకు వసూళ్లను కొనసాగిస్తే ఆల్ టైం హిట్టు సినిమాగా నిలిచింది. ఇంతకీ తాజా కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిస్తే..

    ఆనంద్ దేరకొండ,సాయి రాజేశ్వర్, విష్ణచైతన్యలు ప్రధానంగా నటించిన సినిమా ‘బేబీ’ జూలై 14న రిలీజ్ అయింది. సాయి రాజేశ్వర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ కథాంశం బాగా ఆకట్టుకుంది. ఈమధ్య చిన్న సినిమాలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో చాలా మంది ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో కంటెంట్ నే నమ్ముకొని ఈ సినిమాను థియేటర్లకు తెచ్చారు. వారు అనుకున్న విధంగానే కథాంశం తోనే సినిమా బాగా హిట్టయింది. ముఖ్యంగా లవ్ ఎమోషన్ బాగా ఆకట్టుకోవడంతో యూత్ మళ్లీ మళ్లీ ఈ సినిమా చూస్తున్నారు.

    బేబీ రిలీజ్ అయ్యేవరకు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఈమూవీ మొత్తంగా రూ.7.40 కోట్లతో అమ్మారు. ఇందులో నైజాం రూ.2.25 కోట్లు, ఆంధ్రా రూ.2.80 కోట్లు, సీడెడ్ రూ.ఒక కోటి, రెస్టాప్ ఇండియా రూ.1.35 కోట్ల బిజినెస్ అయింది. సినిమా రిలీజ్ అయి 24 రోజులు అవుతున్నా రోజురోజుకు కలెక్షన్లు పెరగడమే తప్ప తగ్గడం లేదు. 24వ రోజు ఈ మూవీకి ఓవరాల్ గా రూ.33.37 కోట్ల లాభంతో రన్ అయింది. ఇలా మొత్తంగా మూవీకి రూ.77.70 కోట్లు రాబట్టింది.

    మూవీ బిజినెస్ థియేటర్, శాటీలైట్ కలిపి రూ.10 కోట్ల బిజినెస్ కాగా రూ. 70 కోట్ల గ్రాస్, రూ.33.37 కోట్ల లాభంతో రన్ అవుతోంది. దీంతో ఈ ఏడాదిలోనే ఇది బెస్ట్ మూవీగా చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలను కాదని కలెక్షన్లతో దూసుకుపోతుండడంతో సినిమా టీంకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా సక్సెస్ మీట్లతో ఈ మూవీకి మరింత బలం చేకూరిందన్న చర్చ సాగుతోంది.