హెచ్.ఐవీ లేదా ఎయిడ్స్.. 1981 జూన్ 18న దీన్ని అమెరికాలో కనుగొన్నారు. మొట్టమొదటి కేసు అమెరికాలోనే నమోదైంది. మొదట స్వలింగ సంపర్కులకు ఈ వ్యాధి వస్తుందని అనుకున్నారు. కానీ ఆ తర్వాత శృంగారం ద్వారా వస్తుందని తేల్చారు. ప్రధానంగా రోగనిరోధక వ్యవస్థను ఈ వైరస్ దెబ్బతీస్తుంది. వైరస్ రూపాంతరం చెందుతుంటుంది.అందుకే ఇప్పటివరకు దీనికి వ్యాక్సిన్ కానీ మందులు కానీ కనిపెట్టడం సాధ్యం కాలేదు.ఇప్పుడు మానవాళిని కబళిస్తున్న కరోనా వంటి వైరస్ కూడా ఇలాంటిదే.. ఇది హెచ్.ఐవీ లాగే మార్పు చెందుతూ ఉంటుంది. కాబట్టి దీనికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి చాలా సమయం పడుతోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతున్న ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టడానికి చాలా కష్టమని సైంటిస్టులు చెబుతున్నారు..
*కరోనాకు వ్యాక్సిన్ అంత ఈజీ కాదు..
కరోనాకు వ్యాక్సిన్ తయారు చేయడం అంత ఈజీ కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా వైరస్ మొదట పుట్టిందానికి ఇప్పుడు ఉన్నదానికి మార్పు చెందుతోందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.. మొదట వైరస్ కు వ్యాక్సిన్ కనిపెడితే ఇప్పుడు వ్యాపిస్తున్న కొత్తరకం కరోనా కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. పైగా దేశాలను బట్టి కరోనా వైరస్ ఉత్పరివర్తనం చెందుతుండడం ఆందోళన కలిగించే విషయం. ఇటలీ, బ్రిటన్, అమెరికా వంటి శీతల దేశాల్లో ఈ మహమ్మారి లక్షల మందికి సోకుతూ వందలమంది ప్రాణాలు తీస్తోంది. భారత్ వంటి వేడి దేశాల్లో మాత్రం నెమ్మదిగా వ్యాపిస్తోంది. దీనిపై భారత శాస్త్రవేత్తలు కూడా జన్యు స్థాయి పరిశోధన చేయగా.. మన దగ్గర వైరస్ అంత వేగంగా విస్తరించేది కాదని తేల్చారు..
*12 రకాల కరోనా వ్యాక్సిన్ లు
ఇక అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్ శాస్త్రవేత్తలు రోగుల ద్వారా సేకరించిన కరోనావైరస్ జాతులపై పరిశోధన చేయగా షాకింగ్ విషయం బయటపడింది. వారి దేశంలో సోకుతున్న కోవిడ్ -19 వైరస్ యొక్క ఉత్పరివర్తనాల గురించి తాజాగా ఆశ్చర్యకరమైన వెల్లడించారు. 260 రోగులకు రోగులను కరోనా వైరస్ ను విశ్లేషించిన తరువాత, బ్రిటీష్ జన్యు శాస్త్రవేత్తలు కోవిడ్ -19 దాదాపు 12 రకాల ఉత్పరివర్తనలు తమ దేశంలో ఉన్నట్లు కనుగొన్నారు. అంటే 12 రకాల కరోనా వైరస్ లు ఇంగ్లండ్ దేశంలో రోగులకు వ్యాపిస్తున్నట్టు తేల్చారు. ఇందులో ఒక రకం కరోనా ఉత్పరివర్తనం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కనిపించకపోవడం విశేషం. ఇది యునైటెడ్ కింగ్ డమ్ లో మాత్రమే వెలుగుచూసిందట.. అంటే ఓ కరోనా వైరస్ బ్రిటన్ లో పూర్తిగా కొత్త వైరస్ గా మారిందన్నమాట..
*బ్రిటన్ లో కొత్త రకం కరోనా
బ్రిటన్ లోని కరోనా వైరస్ కు చైనాలో సోకిన దానికి దీనికి పొంతనే లేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. కాబట్టి మొదట కరోనా వైరస్ కు తయారు చేసిన వ్యాక్సిన్ బ్రిటన్ లో పనిచేయదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది పూర్తిగా యూకే స్వదేశీ కోవిడ్ -19 వైరస్ గా అక్కడి శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. . అంటే దేశానికో వైరస్ ఉందన్నమాట.. 12 రకాల వైరస్ లుగా మారాయి. వాటన్నింటికి వ్యాక్సిన్ లు కనిపెట్టాలంటే ఎన్ని రోజులు పడుతుందో ఉహించుకుంటేనే భయంగా ఉంది. అప్పటివరకు అన్ని బంద్ చేసి ఇంట్లో కూర్చోవడం సాధ్యమా? కరోనాకు ఎదురెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవడమా అన్నది ఇక్కడ అందరినీ తొలుస్తున్న ప్రశ్న.
* రూపాంతరం చెందుతున్న కరోనాతో ఉలిక్కిపడ్డ శాస్త్రవేత్తలు
కరోనా వైరస్ కు వ్యాక్సిన్ తెస్తున్న పరిశోధకులకు ఇలా 12 రకాల కరోనా వైరస్ లు ఉన్నాయని తెలియడంతో ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న వ్యాక్సిన్లు బ్రిటన్ దేశ ప్రజలపై ప్రభావం చూపవనే ఆందోళన మొదలైంది. ఇదే జరిగితే వినాశనం తప్పదు. కరోనావైరస్ అన్ని దేశాల్లోని జాతులకు అనుకూలంగా వ్యాక్సిన్ పనిచేయకపోవచ్చని శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు భయపడుతున్నారు.
*దేవుడే కాపాడాలి..
ఇప్పటికే కరోనాకు మందు కనిపెట్టలేక.. దాన్ని కంట్రోల్ చేయలేక ప్రపంచదేశాలన్నీ తలపట్టుకుంటున్నాయి. అగ్రరాజ్యాలు, పేద రాజ్యాలు అన్న తేడా కరోనా మహమ్మారి కోరలు చాస్తూనే ఉంది. వ్యాక్సిన్ల తయారీలో పురోగతి కనిపించడం లేదు. చూస్తుంటే ఏదో ఒక మానవాతీత శక్తి వచ్చి ఆదుకోవడమో.. లేక మనిషిలోని సహజ రోగనిరోధక శక్తి రావడమో తప్ప ఇప్పటికిప్పుడు కరోనాకు వ్యాక్సిన్ కానీ మందు కనిపెట్టడం అసాధ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
-నరేశ్ ఎన్నం