https://oktelugu.com/

Bride Jump from Function Hall: తాళికట్టే సమయానికి మండపం నుంచి వధువు మాయం..: ప్రియుడితో పెళ్లి..

Bride Jump from Function Hall: పెళ్లి జరిగే సమయానికి పెళ్లికూతురు లేదా పెళ్లి కొడుకు మాయమయ్యే వార్తలు ఈ మధ్య చాలా వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా తాళికట్టే సమయానికి ఓ వధువు మండపం నుంచి పారిపోయింది. అనంతరం ప్రియుడిని పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులకు షాక్ ఇచ్చింది. అటు వరుడి కుటుంబంలోనూ విషాదం నింపింది. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుందామని కలలుకన్నపెళ్లికొడుకుతో పాటు.. ఈ కార్యక్రమానికి మాకు లక్షల్లో ఖర్చయిందని వరుడి బంధువులు పోలీస్ స్టేషన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 15, 2021 / 01:59 PM IST
    Follow us on

    Bride Jump from Function Hall: పెళ్లి జరిగే సమయానికి పెళ్లికూతురు లేదా పెళ్లి కొడుకు మాయమయ్యే వార్తలు ఈ మధ్య చాలా వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా తాళికట్టే సమయానికి ఓ వధువు మండపం నుంచి పారిపోయింది. అనంతరం ప్రియుడిని పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులకు షాక్ ఇచ్చింది. అటు వరుడి కుటుంబంలోనూ విషాదం నింపింది. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుందామని కలలుకన్నపెళ్లికొడుకుతో పాటు.. ఈ కార్యక్రమానికి మాకు లక్షల్లో ఖర్చయిందని వరుడి బంధువులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు.

    Bride Jump from Function Hall

    ఏపీలోని గుంటూరు జిల్లా మదనపల్లె టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లె మండలం తట్టివారిపల్లెకు చెందిన రామకృష్ణ, మల్లిక దంపతులకు సోనిక అనే కుమార్తె ఉంది. ఈమెకు ఓ యువకుడితో పెళ్లి ఖాయం చేశారు. ఈ శని, ఆదివారాల్లోపెళ్లి కార్యక్రమం జరిగేలా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే పెళ్లి కార్యక్రమానికి ఇరు కుటుంబాల బంధువులంతా వచ్చారు. ఉదయం 5.30 గంటలకు పెళ్లి కొడుకు సైతం మండపానికి చేరుకున్నారు.

    Also Read: అక్క కోసం వెళ్లి చెల్లిని.. త్రివిక్రమ్ పెళ్లి విషయంలో షాకింగ్ ఘటన..: సంవత్సరం ఎందుకాగాడు?

    అయితే రెడీ అవుదామని పెళ్లికూతురు గదిలోకి వెళ్లింది. కానీ ఎంతసేపటికి తిరిగి రాలేదు. బంధువులు ఎలాగోలా గదిలోకి వెళ్లి చూడగా అక్కడ పెళ్లి కూతురు కనిపించలేదు. అయితే మౌనిక తన ప్రియుడితో కలిసి పెళ్లి చేసుకొని మదనపల్లె టౌటౌన్ పోలీసులను ఆశ్రయించింది. తమకు పెద్దల నుంచి ప్రమాదం ఉందని, తమకు రక్షణ కల్పించాలని ఆ ప్రేమ జంట కోరింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఇదివరకే తల్లిదండ్రులకు చెప్పానని, పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని పోలీసులకు తెలిపింది.

    Also Read: హాట్ టాపిక్.. అదనంగా డిమాండ్ చేసిన హీరోయిన్.. సినిమా నుంచి తొలగించిన నిర్మాత

    పెళ్లికొడుకు తల్లిదండ్రులు మాత్రం ఈ పెళ్లి జరుగుతుందని లక్షల రూపాయలు ఖర్చు చేశామని, ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారని వారు సైతం పోలీసులను ఆశ్రయించారు. అంతేకాకుండా మాకు చాలా అవమానం జరిగిందని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వారు శాంతించేలా పోలీసులు చర్చలు జరుపుతున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్న మౌనిక ఎంబీఏ పూర్తి చేసి గురుకుల పాఠశాలలో సూపర్ వైజర్ గా పనిచేస్తోంది. ప్రియుడిని ప్రేమించి అతడికోసమే తాజాగా వెళ్లి వరుడికి, తల్లిదండ్రులకు గట్టి షాక్ ఇచ్చింది.