Akhanda: నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా అఖండ. తాజాగా, ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. మాస్ డైలాగ్స్‌తో బాలయ్య ఓ ఊపు ఊపేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్లిపోతోంది. విడుదలైనప్పటినుంచి ఇప్పటి వరకు 10 మిలియన్లకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది. మరోవైపు 300కేకి పైగా లైక్స్‌ను సొంతం చేసుకుంది.
ట్రైలర్‌కు ప్రేక్షకులు, అబిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. జగపతి బాబు, శ్రీకాంత్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
మరోవైపు ట్రైలర్‌లోని డైలాగ్‌లు పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఒక్కో డైలాగ్ నెరేషన్ థియేటర్లలో పూనకాలు పుట్టించేలా అనిపిస్తున్నారు. ‘అంచనా వేయడానికి నువ్వేమైనా పోలవరం డ్యామా.. పట్టిసీమ తూమా.. పిల్ల కాలువ’ అంటూ బాలయ్య బెదిరించే సీన్ బాలయ్య ఇమేజ్ను మరింత పెచ్చింది. మరోవైపు శ్రీకాంత్, జగపతి బాబు కూడా ఈ సినిమాలో డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు.
అఖండగా బూడిద పూసుకొని అఘోరగా బాలయ్య ఎంట్రీ అదిరిపోయింది. సమస్యకు పిండం పెడుతానంటూ బాలయ్య ఇంగ్లీష్ డైలాగులు జోడించి విలన్ శ్రీకాంత్ ను భయపెట్టే సన్నివేశాలు ‘అఖండం’గా ఉన్నాయి. ఏకే 47 చేతబట్టి బాలయ్య చెలరేగిపోయిన తీరు చూస్తే సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. ఒక్క ట్రైలర్‌కే ఈ రేంజ్లో రెస్పాన్స్ వస్తే.. ఇక సినిమా ఎలా ఉంటుందో తలుచుకుంటేనే అభిమానులకు పూనకాలు వస్తున్నాయి.
