Bride Dance Wedding Cancelled: నేటి కాలంలో మనుషులు చిన్న చిన్న విషయాలకే ఆహాలను పెంచుకుంటున్నారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడడం లేదు. అటువంటిదే ఈ సంఘటన కూడా. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు మందలించడం.. అది కాస్త పెళ్లి కుమార్తె తండ్రికి తెలియడం.. ఆయన కీలక నిర్ణయం తీసుకోవడం.. వంటివి క్షణాలలో జరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మార్కాపురం జిల్లా రాచర్ల మండలం చిన్నగానిపల్లి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
చిన్నగాని పల్లి ప్రాంతానికి చెందిన ఓ యువకుడు.. కంభం మండలం తురుమెల్ల గ్రామానికి చెందిన ఓ యువతి తో వివాహం కుదిరింది.. వివాహం జరిగే రోజు రానే వచ్చింది. పెళ్లికి ముందు రోజు రాత్రి వరుడి గ్రామంలో ఊరేగింపు ప్రారంభించారు. ఊరేగింపు నేపథ్యంలో వధూవరులను డ్యాన్స్ చేయాలని చుట్టుపక్కల వారు అడిగారు. డ్యాన్స్ చేసేందుకు వధువు సిద్ధమైంది. ఈ సమయంలో వరుడికి కోపం వచ్చింది. ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. డ్యాన్స్ చేయడానికి వీలు లేదని చెప్పాడు. దీంతో ఆ వధువు అలిగింది. ఈ విషయం వధువు తండ్రికి తెలిసింది. పెళ్లికి ముందే ఇలా ఉంటే.. పెళ్లి జరిగిన తర్వాత ఎలా ఉంటాడోనని ఆ తండ్రి మదనపడ్డాడు. కీలక నిర్ణయం తీసుకున్నాడు.
వధువుపై వరుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం.. డ్యాన్స్ చేయడానికి వీలు లేదని చెప్పడంతో ఆ విషయం వధువు తండ్రికి తెలిసింది. దీంతో వెంటనే ఇటువంటి వ్యక్తికి తన బిడ్డను ఇచ్చి పెళ్లి చేసే ఉద్దేశం లేదని అతడు తేల్చి చెప్పేశాడు. అంతే వివాహం ఒక్కసారిగా రద్దయిపోయింది. పెళ్లి మండపంలో ఉండాల్సిన సందడి మాయమైపోయింది. బంధువులు ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినప్పటికీ వధువు తండ్రి నిర్ణయాన్ని మార్చుకోలేదు. వధువు కూడా తన తండ్రి నిర్ణయానికి ఓకే చెప్పింది. వరుడు తరుపున వారు రకరకాల రాయబారాలు పంపినప్పటికీ అతడు కరిగిపోలేదు. “నా కుమార్తె ను ఎన్నో విధాలుగా చూసుకున్నాను. ఆమెను ఆడంబరంగా పెంచాను. అన్ని సమకూర్చాను. కానీ ఇతడు డ్యాన్స్ కూడా చేయద్దని చెప్తున్నాడు. ఇటువంటి వ్యక్తికి నేను బిడ్డను ఇచ్చే ఉద్దేశం లేదు. అందువల్లే పెళ్లి రద్దు చేశాను. నా బిడ్డను నా స్థాయికి తగ్గట్టు వాళ్లకు ఇచ్చుకుంటానని” ఆ వ్యక్తి చెప్పాడు.. ఈ విషయం బయటకు పొక్కడంతో సంచలనంగా మారింది.

