బ్రేకింగ్: హైదరాబాద్ పరిధిలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు

నాలుగైదు రోజులుగా జరుగుతున్న కౌంటింగ్ ప్రహసనానికి తెరపడింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ఎట్టకేలకు పూర్తయ్యింది. టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి సమీప బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచంద్రరావు పై రెండో ప్రాధాన్య ఓటుతో ఆమె గెలుపొందారు. వాణిదేవికి 1,12,689 ఓట్లు రాగా.. 36,580 రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. పీవీ కుమార్తె సురభి వాణిదేవి విజయాన్ని కొద్ది సేపట్లోనే ఎన్నికల సంఘం అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో 91మంది అభ్యర్థులు […]

Written By: NARESH, Updated On : March 20, 2021 5:41 pm
Follow us on

నాలుగైదు రోజులుగా జరుగుతున్న కౌంటింగ్ ప్రహసనానికి తెరపడింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ఎట్టకేలకు పూర్తయ్యింది. టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి సమీప బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచంద్రరావు పై రెండో ప్రాధాన్య ఓటుతో ఆమె గెలుపొందారు. వాణిదేవికి 1,12,689 ఓట్లు రాగా.. 36,580 రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి.

పీవీ కుమార్తె సురభి వాణిదేవి విజయాన్ని కొద్ది సేపట్లోనే ఎన్నికల సంఘం అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో 91మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అనంతరం వాణిదేవికి తొలి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓట్లు ద్వారా ఈ గెలుపు సాధ్యమైంది. మొత్తంగా 1,49,249 ఓట్లు వాణిదేవి సాధించారు.

వాణిదేవి గెలుపునకు అవసరమైన కోటా రావాలంటే ఇంకా 19251 ఓట్లు రావాల్సి ఉంది. అయితే ఎవరికీ కోటాకు అవసరమైన ఓట్లు రాకపోవడంతో బీజేపీ అభ్యర్థి రాంచంద్రరావు ఎలిమినేషన్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఈయనకు తొలి ప్రాధాన్యత ఓట్లు 1,04,668 ఓట్లు రాగా.. 32898 రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. మొత్తంగా 1,37,566 ఓట్లు సాధించారు.

ఇక ఓటమి ఖాయం కావడంతో బీజేపీ ఏజెంట్లు, కొందరు పార్టీ కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రం నుంచి నిష్క్రమించారు. టీఆర్ఎస్ శ్రేణులు సరూర్ నగర్ స్టేడియం వద్ద సంబరాలు చేసుకుంటున్నారు.