
Kodali Nani Arrested : వైసీపీ పార్టీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి కొడాలి నాని గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది.ప్రత్యర్థుల పైన ఎల్లపుడూ బూతుపురాణం ని చదివే వ్యక్తి ఆయన.అతని నోట్లో నోరు పెట్టడం అనేది పెద్ద బుర్రతక్కువ పని అని రాజకీయ విశ్లేషకులు సైతం అంటూ ఉంటారు.ముఖ్యంగా చంద్ర బాబు నాయుడు మరియు లోకేష్ ని అయితే పచ్చి బూతులు తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఆయన నోటి దూలకు ఎదో ఒకరోజు కష్టాల్లో ఇర్రుకుంటాడని అందరూ అనుకున్నారు.అయితే నోటి దూల వల్ల కాకుండా వైసీపీ పార్టీ ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ఆయన చేసిన ఒక కార్యక్రమం వల్ల కొడాలి నాని అరెస్ట్ కాబోతున్నాడని తెలుస్తుంది.కోర్టు ఇచ్చిన అరెస్ట్ వారంట్ ని కూడా లెక్క చెయ్యకుండా కొడాలి నాని ప్రవర్తిస్తున్న తీరుపై పోలీస్ వ్యవస్థ చాలా తీవ్రమైన ఆగ్రహం వ్యకతం చేస్తుంది.
అసలు విషయానికి వస్తే 2016 వ సంవత్సరం లో కొడాలి నాని, మాజీ మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర నుంచి వన్ వే లో ఒక భారీ ర్యాలీ ని నిర్వహించారు.ఈ ర్యాలీ వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడి జనాలు ఎన్నో ఇబ్బందులకు గురి అవ్వాల్సి వచ్చింది.ఆ ప్రాంతంలోనే ఒక అంబులెన్సు కూడా చిక్కుకొని పేషెంట్ ని సకాలం లో ఆసుపత్రికి చేర్పించలేకపోయింది.ఇలా ఎన్నో శాంతి కార్యక్రమాలు చోటు చేసుకోవడం తో కొడాలి నాని పై కేసు నమోదు చేసారు.అయితే అప్పటి నుండి కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసి కొడాలి నాని ని వివరణ కోరారు.
కానీ ఆయన ఉద్దేశపూర్వకంగానే కోర్టు కి హాజరు కాలేదు.దీనిపై కోర్టు చాలా సీరియస్ రియాక్షన్ ఇచ్చింది.పోలీసులను వివరణ కోరగా గవర్నరు పేట సీఐ సురేష్ కుమార్ గురువారం కోర్టు కి హాజరై వివరణ ఇవ్వాల్సి వచ్చింది.అతని వివరణ విన్న తర్వాత కొడాలి నాని ని తక్షణమే అరెస్టు చెయ్యాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.దీనితో రేపో మాపో ఆయన అరెస్ట్ కాబోతున్నాడని రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ.