
Chiranjeevi – Sridevi : టాలీవుడ్ లో అగ్ర కథానాయిక గా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత బాలీవుడ్ , కోలీవుడ్ అని తేడా లేకుండా ప్రతీ ఇండస్ట్రీ లోను నెంబర్ 1 స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నటి శ్రీదేవి.ఈమెకి ఆరోజుల్లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు.స్టార్ హీరో తో సరిసమానమైన ఇమేజిని సంపాదించుకుంది..అయితే ఇక్కడి నుండి బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత ఆమెకి టాలీవుడ్ అంటే చాలా చిన్నచూపు మొదలైందని చాలామంది ప్రముఖులు చెప్తూ ఉండేవారు.
బాహుబలి సినిమా సమయం లో రాజమౌళి కూడా శ్రీదేవి పై సంచలన ఆరోపణలు చేసాడు.అది కాసేపు పక్కన పెడితే అప్పట్లో ఈమె మెగాస్టార్ చిరంజీవి ని ఒక రేంజ్ అవమానించిందట.అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి హీరో గా,కోదండరామి రెడ్డి దర్శకత్వం లో ‘కొండవీటి దొంగ’ అనే సినిమా వచ్చింది.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి మొదట్లో ఘోరమైన నెగటివ్ టాక్ వచ్చింది.
కానీ రోజులు పెరిగే కొద్దీ ఈ సినిమాకి మెల్లగా పాజిటివ్ టాక్ వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఈ సినిమాలో హీరోయిన్స్ గా విజయశాంతి మరియు రాధ నటించారు.అయితే రాధ పాత్ర కోసం ముందుగా శ్రీదేవి ని సంప్రదించారట.ఆమె కథ మొత్తం విన్న తర్వాత సినిమా చేస్తాను అని చెప్పింది కానీ, కొన్ని విచిత్రమైన షరతులు పెట్టింది.అదేమిటంటే ఈ సినిమా కథ మొత్తం తనకి అనుకూలంగా మార్చమని చెప్పిందట.
అంతే కాదు టైటిల్ ‘కొండవీటి దొంగ’ కాకుండా ‘కొండవీటి రాణి’ గా మార్చాలని, టైటిల్స్ పడేటప్పుడు హీరో కంటే ముందుగా నా పేరే పడాలి అంటూ విచిత్రమైన షరతులు పెట్టిందట.అదంతా విన్న తర్వాత డైరెక్టర్ కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది.శ్రీదేవి కి నమస్కారం పెట్టి అక్కడి నుండి బయలుదేరు, రాధ ని హీరోయిన్ గా తీసుకున్నాడు.ఈ వార్త ఆరోజుల్లో ఒక సంచలనం అట.