బ్రేకింగ్: ఉద్యోగులకు 30శాతం ఫిట్ మెంట్, పీఆర్సీ

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా శుభవార్త చెప్పారు. ఏకంగా ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం కంటే కూడా ఎక్కువగా 30శాతం పిట్ మెంట్ అందించారు. అంతేకాదు ఏకంగా పీఆర్సీ కింద జీతాలు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ కేసీఆర్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఉద్యోగుల రిటైర్ మెంట్ వయసును 61 ఏళ్లకు పెంచారు. ఇక మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులను ఇస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు. ఇస్తామన్న […]

Written By: NARESH, Updated On : March 22, 2021 12:42 pm
Follow us on

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా శుభవార్త చెప్పారు. ఏకంగా ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం కంటే కూడా ఎక్కువగా 30శాతం పిట్ మెంట్ అందించారు. అంతేకాదు ఏకంగా పీఆర్సీ కింద జీతాలు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ కేసీఆర్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఉద్యోగుల రిటైర్ మెంట్ వయసును 61 ఏళ్లకు పెంచారు. ఇక మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులను ఇస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు. ఇస్తామన్న దానికంటే 1శాతం ఎక్కువే పీఆర్సీ ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి ఇవి అమలు అవుతాయి..

ఇక ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, బదిలీలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంత్ జిల్లాల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందరూ ఉద్యోగులకు వేతనాలు పెంచారు. 9 లక్షలకు పైగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సంతృప్తి పరిచేవిధంగా కేసీఆర్ ప్రకటించారు. వేరు వేరు జిల్లాల్లో ఉన్న భార్యభర్తలను ఒకే జిల్లాకు వచ్చేందుకు అనుమతిచ్చారు.అంగన్ వాడీ, వీఆర్ఏలకు పీఆర్సీ వర్తింప చేశారు.

ఏపీ ఉద్యోగులను అక్కడికి పంపడానికి.. అక్కడి నుంచి తెలంగాణ ఉద్యోగులను రప్పించడానికి కేసీఆర్ జీవో జారీ చేశారు. అన్ని రకాల ఉద్యోగులకు పెన్షనర్లకు జీతాలు పెంపు, ఫిట్ మెంట్ వర్తింప చేశారు.