https://oktelugu.com/

NDA: మోదీ ఆర్థిక కౌగిలిలో నాయుడు, నితీశ్‌… ఇరుక్కుపోయారా..?

బిహార్‌లో అధికారంలో ఉన్న నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ పరిస్థితి కూడా ఇంతే. వచ్చే ఏడాది బిహార్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనన్నాయి. ఇప్పటికే వరుసగా మూడుసార్లు జేడీయూ అధికారంలోకి వచ్చింది. మరోసారి జేడీయూ అధికారంలోకి రావాలంటే.. ఈ ఏడాది కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇందకు కేంద్రం సహకారం ముఖ్యం. ఈ నేపథ్యంలోనే నితీశ్‌ తెలివిగా అసెంబ్లీలో ప్రత్యేక హోదా కావాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 13, 2024 / 11:21 AM IST

    NDA

    Follow us on

    NDA: ఎన్‌డీఏతో అంటకాగడం వారి ఉత్తమ పందెం ఎందుకంటే 25 పార్టీల నాయకుల కూటమితో వ్యవహరించడం కంటే తమ రాష్ట్రాలకు అవసరమైన నిధులను పొందడానికి ఒక వ్యక్తితో వ్యవహరించడం మంచిదని వారికి తెలుసు.

    కేంద్రంలో వరుసగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్, బీహార్‌ ముఖ్యమంత్రులు, చంద్రబాబు నాయుడు, నితీశ్‌కుమార్‌ వరుసగా రూ.లక్ష కోట్లు, రూ.30 వేల కోట్ల ప్యాకేజీ కోసం ప్రధాని నరేంద్రమోదీపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో కీలకంగా ఉన్నారు. టీడీపీకి ఉన్న 16 మంది ఎంపీలు, జేడీయూకు ఉన్న 12 మంది బలంతోనే కేంద్రంలో మోదీ ప్రధాని అయ్యారు. చంద్రబాబు, నితీశ్‌కు కలిసి 28 సీట్ల బలం ఉంది. దీంతో మోదీ సర్కార్‌ బలం 293గా ఉంది. వీరు మద్దతు ఉపసంహరించుకుంటే ఎన్డీఏ బలం 265కు పడిపోతుంది. మ్యాజిక్‌ ఫిగర్‌కు 275 స్థానాలు అవసరం. ఈ నేపథ్యంలో మోదీ కూడా ఈ ఇద్దరు నేతలను ప్రస్తుతం వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఇదే అదనుగా ఇద్దరు నేతలు తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం మోదీపై ఒత్తిడి పెంచుతున్నారు. రెండు రాష్ట్రాలకు ఇప్పుడు ఆర్థికసాయం అవసరం ఈ నేపథ్యంలో వారు కూడా కేంద్రంలోనీ ఎన్డీఏ నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఒక రకంగా చెప్పాలంటే తమ ఆర్థిక అవసరాల కోసం ఇద్దరూ మోదీ సారథ్యంలోని ఎన్డీఏలో తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి.

    టీడీపీకి అత్యవసరం..
    ప్రస్తుతం ఏపీలో టీడీపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. టీడీపీ అదినేత చంద్రబాబునాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ పరిస్థితిలో రాష్ట్రంలో ప్రభుత్వం నడిపించడం వీరికి అంత ఈజీ కాదు. ఇప్పటికే ఏపీ అప్పులు రూ.14 లక్షల కోట్లకు చేరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని నడపడం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఏపీ ప్రభుత్వానికి అంత ఈజీ కాదు. ఈ నేపథ్యంలోనే వారు కేంద్రంవైపు చూస్తున్నారు. కేంద్రంలో ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో ఆర్థికసహకారంతోపాటు రూ.లక్ష కోట్ల ప్యాకేజీ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే.. కేంద్రం నుంచి బయటకు వస్తే.. ప్రస్తుతం ఉన్న సహకారం కూడా అందదు. దీంతో ఏపీలో ప్రభుత్వం నడపడం కష్టమవుతుంది. అందుకే టీడీపీ అధినేత కేంద్రాన్ని గట్టిగా డిమాండ్‌ చేయలేని పరిస్థితి.

    వచ్చే ఏడాది బిహార్‌ ఎన్నికలు..
    ఇక బిహార్‌లో అధికారంలో ఉన్న నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ పరిస్థితి కూడా ఇంతే. వచ్చే ఏడాది బిహార్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనన్నాయి. ఇప్పటికే వరుసగా మూడుసార్లు జేడీయూ అధికారంలోకి వచ్చింది. మరోసారి జేడీయూ అధికారంలోకి రావాలంటే.. ఈ ఏడాది కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇందకు కేంద్రం సహకారం ముఖ్యం. ఈ నేపథ్యంలోనే నితీశ్‌ తెలివిగా అసెంబ్లీలో ప్రత్యేక హోదా కావాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. రూ.30 వేల కోట్ల ప్యాకేజీ కోసం పట్టుపడుతున్నారు. మరోవైపు బిహార్‌లో వరుసగా వంతెనలు కూలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నితీశ్‌కుమార్‌ ప్రభుత్వం పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో కేంద్రం నుంచి బిహార్‌కు సహకారం అత్యవసరం. అందుకే కేంద్రంలో ఎన్డీఏ సర్కార్‌ ఏర్పాటులో కీలకంగా ఉన్న జేడీయూ కూడా కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. అయితే ఉన్నఫలంగా కేంద్రం నుంచి బయటకు రాలేని పరిస్థితి.

    ఆర్థిక మంత్రితో భేటీ..
    ఇదిలా ఉండగా జూలై 23న పార్లమెంటులో కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఈమేరు కసరత్తు మొదలైంది. ప్రస్తుత పరిస్థితిలో కేంద్రం సహకారం కోరుకుంటున్న ఎన్డీఏలోని కీలక భాగస్వామ్య పక్షాలు అయిన టీడీపీ, జేడీయూ నేతలు చంద్రబాబు నాయుడు, నితీశ్‌కుమార్‌ ఇటీవలే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. ప్రత్యేక ప్యాకేజీని డిమాండ్‌ చేశారు. రెండు రాష్ట్రాలకు కలిపి సుమారు రూ.50,000 కోట్లు (6 బిలియన్‌ డాలర్లు) డిమాండ్‌ చేశారు. అదనంగా మూలధన వ్యయం కోసం రూ.లక్ష కోట్ల వడ్డీలేని దీర్ఘకాలిక రుణాలు కావాలని కోరారు. రాష్ట్రాలు మార్కెట్‌ నుంచి కూడా రుణాలు తీసుకోవడానికి సడలింపులను కోరారు. కేంద్ర ప్రభుత్వం రుణ పరిమితిని రాష్ట్ర ఆదాయం లేదా స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పతిలో 3%కి పరిమితం చేసింది.

    – బీహార్‌ ప్రత్యేకంగా తొమ్మిది కొత్త విమానాశ్రయాలు, రెండు పవర్‌ ప్రాజెక్టులు, రెండు నదీ జలాల కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని, నిర్దిష్ట కాలపరిమితి లేకుండా ఏడు వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని కోరింది.

    – ఇక ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి, నీటిపారుదల ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ డిమాండ్‌ చేశారు.