
Inter Time Table: కరోనాతో మూతపడ్డ విద్యాసంస్థలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. చదువులు చక్కబడుతుండడంతో ప్రభుత్వం విద్యాసంస్థలను ఇటీవలే తెరిసింది. తెలంగాణలో సెప్టెంబర్ 5నుంచి విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు అకాడమిక్ క్యాలెండర్ జారీ చేసింది. ఈ సందర్భంగా బోర్డు సెక్రటరీ ఒమర్ జలీల్ ఈ క్యాలెండర్ విడుదల చేశారు. అందరూ క్యాలెండర్ పాటించాలని ఆదేశించారు. ఉల్లంఘిస్తే ప్రిన్సిపల్స్, యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అఫిలియేషన్ రద్దు చేస్తామని.. చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇంటర్ క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాది 220 రోజుల పాటు తరగతులు ఉండనున్నాయి. జులై 1వ తేదీ నుంచి ఆన్ లైన్ క్లాసులు ప్రారంభమైన తరుణంలో ఆన్ లైన్ క్లాసులు 47 రోజులు.. ఫిజికల్ 173 రోజులు ఉండేలా అకాడమిక్ ఇయర్ ను రూపొందించారు.
ఫిబ్రవరి 10 నుంచి 18 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ప్రాక్టీకల్ పరీక్షలను ఫిబ్రవరి 23 నుంచి మార్చి 15వరకు నిర్వహించనున్నారు. ప్రాక్టీకల్స్ ను ఫిబ్రవరి 23నుంచి మార్చి 15వరకు నిర్వహించనున్నారు.
మార్చి 23 నుంచి ఇంటర్ ఫైనల్ థియరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 13న చివరి వర్కింగ్ డేగా నిర్ణయించారు.