https://oktelugu.com/

ఎల్‌ఆర్‌‌ఎస్‌ లేకున్నా బిల్డింగ్‌ కట్టుకోవచ్చు.. అదెలా అంటే..?

ఎల్‌ఆర్‌‌ఎస్‌ లేకున్నా ఓపెన్‌ ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయాలంటూ ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. భవన నిర్మాణాలకూ ఈ వెసులుబాటు దొరకనుంది. రాష్ట్రంలో ఎల్‌ఆర్‌‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారితో పాటు చేసుకోని వారూ భవన నిర్మాణాల అనుమతి కోరవచ్చు. ప్రభుత్వం తాజాగా ఈ వెసులుబాటు కల్పించింది. అందుకు మార్గదర్శకాలను, చెల్లించాల్సిన ఫీజులను నిర్దేశిస్తూ మున్సిపల్‌ చీఫ్‌ సెక్రటరీ అర్వింద్‌ కుమార్‌‌ ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ సహా రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థలు వీటిని […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 31, 2020 11:35 am
    Follow us on

     LRS Telangana
    ఎల్‌ఆర్‌‌ఎస్‌ లేకున్నా ఓపెన్‌ ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయాలంటూ ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. భవన నిర్మాణాలకూ ఈ వెసులుబాటు దొరకనుంది. రాష్ట్రంలో ఎల్‌ఆర్‌‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారితో పాటు చేసుకోని వారూ భవన నిర్మాణాల అనుమతి కోరవచ్చు. ప్రభుత్వం తాజాగా ఈ వెసులుబాటు కల్పించింది. అందుకు మార్గదర్శకాలను, చెల్లించాల్సిన ఫీజులను నిర్దేశిస్తూ మున్సిపల్‌ చీఫ్‌ సెక్రటరీ అర్వింద్‌ కుమార్‌‌ ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ సహా రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థలు వీటిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

    Also Read: 2020.. కలలు.. కన్నీళ్లు

    ఆగస్టు 28లోగా రిజిస్ట్రేషన్‌ అయి, ఎల్‌ఆర్‌‌ఎస్‌ 2020 మేరకు దరఖాస్తు చేసుకున్నవారు ప్రభుత్వం నిర్దేశించిన చార్జీలను బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్లికేషన్‌ టైంలో చెల్లించాల్సి ఉంటుంది. ఆగస్టు 26లోగా రిజిస్ట్రేషన్‌ అయి, ఎల్‌ఆర్‌‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకోని వారూ భవన నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్‌ఆర్‌‌ఎస్‌కు నిర్దేశించిన చార్జీలతోపాటు 33 శాతం కాంపౌండింగ్‌ ఫీజు, 14 శాతం ఖాళీ స్థలం చార్జీలను ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది.

    ఎల్‌ఆర్‌‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అక్టోబర్‌‌ 31వ తేదీ వరకు అవకాశం కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 25.59 లక్షల మంది దరఖాస్తు చేశారు. 2015 ఎల్‌ఆర్‌‌ఎస్‌కు రుసుము చెల్లించేందుకు ఈ రోజుతో గడువు ముగియనుంది. 2015 నవంబర్‌‌ రెండో తేదీన ఇచ్చిన జీవో 151 ప్రకారం ఎల్‌ఆర్‌‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారు చార్జీలను చెల్లించేందుకు గడువు గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో వారం రోజులుగా చెల్లింపులు జరిగాయి.

    Also Read: రైతు చట్టాలు.. ఆయుష్మాన్ భారత్.. మోడీకి కేసీఆర్ సాగిలపడ్డాడా?

    మరోవైపు.. రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే 6674 రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. దీంతో ప్రభుత్వానికి 117 కోట్ల ఆదాయం వచ్చింది. ఎల్‌ఆర్‌‌ఎస్‌ లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నాలుగు నెలలుగా నిలిచిపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. వీటిని తాజాగా అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనేపథ్యంలో బుధవారం రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్