ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్య రహస్యాలు పాటిస్తోంది. అన్నింట్లో దాపరికాలు చేస్తూ పరిపాలన ఎవరికి తెలియకుండా చేస్తోంది. దీంతో ఎక్కువ కాన్ఫిడెన్షియల్ జీవోలు జారీ చేస్తూ గుట్టుగా వ్యవహారాలు చక్కబెట్టాలని చూస్తోంది. దీంతో ప్రభుత్వంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ జీవోల్లో ఏముందో అనే విషయాలు ఎవరికి తెలియవు. కానీ ఇప్పుడు బ్లాంక్ జీవోలు విడుదల చేస్తున్నారు. ఆ జీవోలో నెంబర్ ఉంటుంది కానీ వివరాలు ఉన్నాయి, అందులో ఏం ఉంటుంది అనే విషయాలు ఏవీ ఉండవు. పరిపాలన శాఖ నుంచి విడుదలైన జీవోల్లో 90 శాతం బ్లాంక్ జీవోలోో కావడం గమనార్హం.
ప్రభుత్వం తీసుకువచ్చే జీవోల్లో గోప్యత పాటించడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. ఈ మధ్య రాజకీయ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇవి మీడియాలో కనిపించకుండా ఉండాలనే ఉద్దేశంతోనే వాటిని రహస్యంగా ఉంచుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ముగ్గురు రాజకీయ నేతలకు పదవులిచ్చారు. ఎంపీ అనురాధ భర్త ఓ రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారికి కొత్తగా పోస్టింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఈ విషయాలు బయటకు రాకుండా జాగ్రత్తలు పడుతున్నట్లు చెబుతున్నారు.
ప్రభుత్వం చేపట్టే నియామకాలు ప్రజల దృష్టిలో పడితే సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో బ్లాంక్ జీవోల విడుదలకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజల సమక్షంలో చేయాల్సిన నిర్ణయాలను ఇలా రహస్యంగా చేస్తూ ప్రభుత్వం దొంగాట ఆడుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై ప్రతిపక్ష పార్టీలే కాదు మాజీ ఉన్నతాధికారులు సైతం విమర్శలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. అయినా ప్రభుత్వంలో పెద్దగా మార్పు ఉండడం లేదు.
దీంతో ప్రభుత్వం రహస్య జీవోలతో తన పని తాను కానిచ్చేందుకు సిద్ధపడుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో డైలమాలో పడిపోయినట్లు సమాచారం. అయినా బ్లాంక్ జీవోల విడుదలలో ప్రభుత్వం ఎందుకు సీక్రెట్ పాటిస్తుందో తెలియాల్సి ఉంది. ప్రభుత్వ నియామకాలను చాటుగా చేస్తూ ప్రతిపక్షాలకు మాత్రం దొరికిపోతోంది.