Black Budget
Black Budget: బడ్జెట్ విషయంలో చాలావరకు మనకు తెలియని పదాలే ఉంటాయి. అయితే ఇందులో బ్లాక్ బడ్జెట్ అనేది ప్రత్యేకంగా ఉంటుంది.. ఇది దేశ ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా ప్రభావితం చేయగలదు.. 1971 లో భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు.. దేశ ఆర్థిక రంగం తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఆ సమయంలో దేశ ఖజానా తీవ్రంగా ప్రభావితమైంది. అదే సమయంలో కరువు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. వ్యవసాయ ఉత్పత్తులు కూడా క్షీణించాయి. పంటల కొరత తీవ్రంగా ఉండడంతో ఆహార ధాన్యాలు ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. ఫలితంగా దేశాన్ని కరువు, ఆకలి ఇబ్బంది పెట్టాయి. భారత ఆర్థిక వ్యవస్థపై ఇవి తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో నాటి ఆర్థిక శాఖ మంత్రి యశ్వంతరావు బి. చవాన్ 1973-74 కాలంలో ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. నాటి బడ్జెట్లో 550 కోట్ల ఆర్థిక లోటు గురించి ఆయన ప్రకటించారు. దీంతో దేశ ఆర్థిక పరిస్థితి మరింత అనిశ్చితంగా ఉందని నాడు అందరికీ అర్థమయిపోయింది. 550 కోట్ల లోటు బడ్జెట్ అంటే ఆ రోజుల్లో చాలా పెద్దదని ఇప్పటి ఆర్థిక నిపుణులు చెబుతుంటారు.
చవాన్ ఏమన్నారంటే..
నాడు బడ్జెట్ ప్రవేశ పెట్టుకుంటూ చవాన్ కీలక వ్యాఖ్యలు చేశారు..” కరువు, ప్రకృతి వైపరీత్యం, యుద్ధం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. కరువు కారణంగా దేశంలో ఆహార ధాన్యాలు ఉత్పత్తి తగ్గిపోయింది. తద్వారా బడ్జెట్ లోటు పెరిగింది. కరువు, ద్రవ్యలోటు వల్ల దేశ ఆర్థిక విధానాలు ఎదుర్కొన్నాయి. ఈ బడ్జెట్లో అందువల్లే ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది.. బొగ్గు గనులు, బీమా కంపెనీలు, ఇండియన్ కాపర్ కార్పొరేషన్ వంటి కీలక రంగాలను జాతీయీకరణ పరిధిలోకి తీసుకొస్తున్నాం. దీనికోసం 56 కోట్లు కేటాయిస్తున్నామని” చవాన్ వెల్లడించారు.. నాడు బొగ్గు గనులను జాతీయం చేయడం వల్ల దేశంలో కిందన రంగం అభివృద్ధి చెందింది.. ఆ నిర్ణయం దేశ ఆర్థిక స్థితిపై తీవ్రమైన ప్రభావం చూపించాయి.. నాడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ ఈ బడ్జెట్ ను బ్లాక్ బడ్జెట్ గా పేర్కొన్నారు. నాడు తీసుకున్న నిర్ణయాలు, ప్రణాళికలు దేశ అభివృద్ధిపై ప్రభావం చూపించాయి. అనిశ్చితి నుంచి.. పెట్టుబడులను కోల్పోయే భయం నుంచి.. వృద్ధి తగ్గడం నుంచి ఉపశమనం కల్పించాయి. ఆ తర్వాత ప్రభుత్వం ఖర్చులను పూర్తిగా తగ్గించుకు. ఆర్థిక క్రమశిక్షణను పాటించింది. ఫలితంగా దేశంలో తాత్కాలిక పేదరికాన్ని తగ్గించడానికి నాటి బడ్జెట్ ఒక సంజీవని లాగా పని చేసింది.
నేటి బడ్జెట్ ఎలా ఉంటుందంటే..
ఇక 2025లో బడ్జెట్ గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆర్థిక విధానాలు, ప్రణాళికలపై ప్రభుత్వం మరింత లోతుగా వెళుతున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు.. బడ్జెట్ కోసం ఇప్పటికే వివిధ రంగాల నుంచి, పరిశ్రమల అధిపతుల నుంచి ప్రభుత్వం ప్రతిపాదనలను స్వీకరించింది.. అయితే ఈసారి బడ్జెట్లో పన్ను మినహాయింపు, చైనా నుంచి వచ్చే వస్తువులపై విధించే సుంకాలే ప్రధాన అంశాలుగా ఉంటాయని తెలుస్తోంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Black budget the central budget of all days do you know what black budget is when was it first introduced
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com