బీజేపీ కొత్త వ్యూహం.. నారదా స్కాం..!

గత ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారీ మెజారిటీ సాధించిన టీఎంసీ అధికారంలో కూర్చుంది. ఎంతో పకడ్బందీగా ప్రచారంతో పాటు అనేక రకాల వ్యూహాలు పన్నినా బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయింది. అయితే అంతకుముందుకంటే ఎక్కువ సీట్లు తెచ్చుకొని రెండో స్థానంలో నిలిచింది. ఇటీవల బీజేపీ నాయకులపై దాడులు జరిగాయని గవర్నర్ సైతం రంగంలోకి దిగి బీజేపీ ఎమ్మెల్యేలను పరామర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికలకు ముందు టీఎంసీ నాయకులపై సీబీఐ కేసులుతో భయపెట్టి సాధ్యమైనంత వరకు లాక్కున్న బీజేపీ, […]

Written By: NARESH, Updated On : May 17, 2021 1:59 pm
Follow us on

గత ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారీ మెజారిటీ సాధించిన టీఎంసీ అధికారంలో కూర్చుంది. ఎంతో పకడ్బందీగా ప్రచారంతో పాటు అనేక రకాల వ్యూహాలు పన్నినా బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయింది. అయితే అంతకుముందుకంటే ఎక్కువ సీట్లు తెచ్చుకొని రెండో స్థానంలో నిలిచింది. ఇటీవల బీజేపీ నాయకులపై దాడులు జరిగాయని గవర్నర్ సైతం రంగంలోకి దిగి బీజేపీ ఎమ్మెల్యేలను పరామర్శిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఎన్నికలకు ముందు టీఎంసీ నాయకులపై సీబీఐ కేసులుతో భయపెట్టి సాధ్యమైనంత వరకు లాక్కున్న బీజేపీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీఎంసీ నాయకులను వదిలిపెట్టడం లేదు. అంతకుముందు శారద స్కాం పేరుతో ఎమ్మెల్యేలపై సీబీఐత రైడ్ చేయించడంతో చాలా మంది బీజేపీలోకి చేరారు. ఆ తరువాత ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కొందరు బీజేపీలో చేరినా చాలా మంది టీఎంసీలోనే ఉన్నారు.

తాజాగా నారద స్కాం పేరుతో ఇద్దరు మంత్రులను అదుపులోకి తీసుకొని సీబీఐ విచారిస్తోంది. వీరే కాకుండా మరికొంత మంది నాయకులను కూడా టార్గెట్ చేసిందని అంటున్నారు. దీంతో ముందు ముందు మరిన్నీ కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మరోవైపు రాజకీయ దాడులు జరిగిన ప్రాంతాల్లో గవర్నర్ పర్యటించారు. అక్కడా ఆయనకు నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే రాజకీయ దాడులు ఎదుర్కొన్న బీజేపీ బాధితులను గవర్నర్ దగ్గరకు తీసుకొచ్చి పరామర్శల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో బెంగాల్ లో ప్రజా పాలన కంటే రాజకీయ వాతావరణమే ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.