కరోనా కారణంగా మరో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. కరోనా మహమ్మారితో ప్రముఖ తమిళ నటుడు నితీశ్ వీరా(45) కన్నుమూశాడు. కొద్ది రోజులుగా కరోనా చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషయమించడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించినా ఆయన ప్రాణాలను వైద్యులు కాపాడలేకపోయారు. చివరికి ఆయన ఉదయం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
నితీశ్ వీరా నటుడిగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా సూపర్ హిట్ ఫిల్మ్ ‘అసురన్’ సినిమాలో ఆయన నటనకు ఎంతో గుర్తింపు దక్కింది. అలాగే నితీశ్ ‘పేరరుసు’, ‘వెన్నిల కబడి కుళు’, ‘పుదు పేట్టై’ వంటి పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం నితీశ్ వీరా విజయ్ సేతుపతి, శృతీ హాసన్ జంటగా నటిస్తున్న ‘లాభం’ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
అలాగే ‘నీరో’ అనే సినిమాలోనూ నితీశ్ వీరా కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇంతలోనే ఆయనను కరోనా కబళించడం దురదృష్టకరం. నితీశ్ వీరా మృతి పట్ల తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అలాగే ఆయనకు తెలుగు చిత్రసీమతో కూడా మంచి అనుబంధం ఉంది. ఆయన రెండు తెలుగు సినిమాల్లో కూడా నటించడానికి అంగీకరించారు. వెంకీ నారప్పలో ఆయన ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు.
ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీకి వరుస షాకులు మీద షాక్ లు తగులుతున్నాయి. మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున నితీశ్ వీరా మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము