Adani: రాజ్యసభ సభ్యుల కోసం వైసీపీలో జోరుగా చర్చ సాగుతోంది. బీజేపీ నుంచి ముగ్గురు వైసీపీ నుంచి ఒకరి పదవీ కాలం పూర్తయినందున మళ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు. సీట్ల పరంగా వైసీపీకే ఆ నాలుగు సీట్లు దక్కనుండటంతో పోటీ తీవ్రమైంది. ఇందులో వైసీపీ సీటు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయసాయిరెడ్డిని మళ్లీ రెన్యువల్ చేయనున్నట్లు తెలుస్తోంది. మిగతా మూడింటిలో ఒకటి మాత్రం అదానీ గ్రూపుకు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. తామే సీటు దక్కించుకోవాలన ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోటీ ఏర్పడింది. కానీ జగన్ మదిలో ఇప్పటికే అందరి పేర్లు ఉన్నాయని తెలుస్తోంది.

అయితే ఇప్పటికే అనుకున్న ఒప్పందం ప్రకారమే అదానీకి రాజ్యసభ సీటు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. జగన్ కు అదానీకి ఉన్న అనుబంధం నేపథ్యంలో ఈ ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్టంలో చాలా ప్రయోజనాలు కల్పించారు. గంగవరం పోర్టు తక్కువ ధరకే ధారాదత్తం చేశారు. అదానీకి ఎంత చేయాలో అంత చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాజ్యసభ సీటు ఇవ్వడం పెద్ద విషయమే కాదు. కానీ వారికి ఉన్న స్నేహం మేరకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక మిగిలిన రెండు సీట్లలో సామాజిక అంశాల ఆధారంగా ఎవరికి కేటాయిస్తారనే దానిపైనే అందరికి ఉత్కంఠ ఏర్పడింది. మరోవైపు కేంద్రంలో తమ సభ్యుల బలం పెంచుకునే అవకాశం దక్కింది. దీన్ని సద్వినియోగం చేసుకుని బీజేపీతో మంచి సంబంధాలు పెట్టుకోవాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి ఎస్సీ సామాజిక వర్గానికి మరొకటి ఇతరులకు కేటాయించే వీలున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా జగన్ మదిలో ఉన్నది మాత్రం ఎక్కడ బయటకు రాదు. ఒకవేళ వస్తే వేరే విషయం.

గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి ఒక్కో సీటు భర్తీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ పరిణామాల నేపథ్యంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని తమ కలల సౌధం నిర్మించుకునేందుకు జగన్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. కానీ భవిష్యత్ లో రాబోయే ఎన్నికలను లెక్కలోకి తీసుకుని తమ సమూహం ఉండాలని జగన్ భావిస్తున్నారు.దీని కోసమే ఆయన కసరత్తు ముమ్మరం చేసి తాను అనుకున్నది చేయాలని చూస్తున్నారు.