BJP: గిరిజనుల మనసు గెలిచిన బిజెపి

భారతీయ జనతా పార్టీ గిరిజన వర్గాల్లో పట్టు సాధించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్మును ఎంపిక చేసింది. అప్పటివరకు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు ను రాష్ట్రపతి చేస్తారని అంతా భావించారు.

Written By: Dharma, Updated On : December 7, 2023 11:14 am

BJP

Follow us on

BJP: దేశవ్యాప్తంగా గిరిజనులు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. దశాబ్దాలుగా వారు కాంగ్రెస్ పార్టీ నీడలోనే ఉండేవారు. మరో పార్టీ వైపు తొంగి చూడడం అరుదు. దేశంలో ప్రాంతీయ పార్టీలు హవా చలాయిస్తున్న వేళ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. ఆ పార్టీకి ఏకపక్షంగా మద్దతు తెలిపేవారు. అయితే తాజాగా వారు బిజెపి వైపు కూడా చూస్తుండడం విశేషం. గత పదేళ్ల కాలంలో వారు యూటర్న్ తీసుకుంటున్నారు. కాంగ్రెస్ తో సమానంగా బిజెపికి అవకాశం ఇవ్వడం విశేషం.

భారతీయ జనతా పార్టీ గిరిజన వర్గాల్లో పట్టు సాధించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్మును ఎంపిక చేసింది. అప్పటివరకు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు ను రాష్ట్రపతి చేస్తారని అంతా భావించారు. అటు ఆర్ఎస్ఎస్ కూడా అలానే డిసైడ్ అయ్యింది. కానీ మోడీ మాత్రం గిరిజనుల్లో బిజెపి పట్ల మంచి అభిప్రాయం కలగాలంటే రాష్ట్రపతి ఎంపిక ఆ వర్గం నుంచి చేయాలని భావించారు. అనుకున్నట్టే ఒడిస్సాలోని మారుమూల గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్మును గుర్తించి రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయించారు. అప్పటినుంచి బిజెపి అంటే తెలియని గిరిజనులు.. ఆ పార్టీని ఆదరించడం ప్రారంభించారు. ఎస్టీ పార్లమెంట్ స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలను సైతం ఆ పార్టీ గెలవడం ప్రారంభించింది.

ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో గిరిజన అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేది. 2018 వరకు ఇదే ఆనవాయితీ కొనసాగేది. కాంగ్రెస్ పార్టీ 70 శాతం గెలుచుకుంటే.. ఇతరులు 30% నియోజకవర్గాలను గెలుచుకునేవారు. అయితే తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ 52 గిరిజన అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంటే.. బిజెపి సైతం అదే స్థాయిలోకి చేరుకోవడం విశేషం. ప్రస్తుతం కాంగ్రెస్తోపాటు బిజెపిని సైతం గిరిజనులు విశ్వసిస్తున్నారు. జాతీయ పార్టీలు ఏం చెప్పినా చేస్తాయని.. సామాజికపరంగా వెన్నుదన్నుగా నిలుస్తాయి అన్నది ఒక ప్రజాభిప్రాయం. అందుకే గిరిజనుల సైతం కాంగ్రెస్ తో పాటు బిజెపిని ఆదరిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు పెద్ద సామాజిక వర్గాల పార్టీగా ముద్ర పడిన బిజెపి.. ఇప్పుడు గిరిజనుల మనసును దోచుకోవడం విశేషం. మున్ముందు భారతీయ జనతా పార్టీ గిరిజనుల్లోకి మరింత చొచ్చుకువెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.