Homeఆంధ్రప్రదేశ్‌BJP- Jagan: జగన్‌తో దోస్తీ ముప్పేనా? ఆర్కే భాష్యంలో ఆంతర్యం ఆదెనా?

BJP- Jagan: జగన్‌తో దోస్తీ ముప్పేనా? ఆర్కే భాష్యంలో ఆంతర్యం ఆదెనా?

BJP- Jagan: ఆంధ్రాలో అధికారంలో ఉన్న జగన్‌తో దోస్తీ తెలంగాణలో దూకుడు మీద ఉన్న భారతీయ జన తా పార్టీకి ముప్పు పొంచి ఉందని అభిప్రాయ పడుతున్నారు.. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ. ఈ వారం తన ‘‘కొత్తపలుకు’’లో తెలంగాణ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. ఇందులోకి జగన్‌ను కూడా లాక్కొచ్చి తనదైన పొలిటికల్‌ జర్నలిజం చేశారని అనుకోవచ్చు. తెలంగాణపై బీజేపీ బోలెడన్ని ఆశలు పెట్టుకుందని చెప్పిన ఆర్కే.. అది సాకారం కావాలంటే ఏపీలో జగన్‌ను వదిలేయేలాని సలహా ఇస్తున్నారు. ఎందుకు వదిలేయాలో కూడా కారణాలు చెప్పారు. తెలంగాణలో సీమాంధ్రులు కనీసం 25 నియోజకవర్గాల్లో ప్రభావ స్థితిలో ఉన్నారని.. వారు బీజేపీకి ఓటు వేయడం లేదని గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సీమాంధ్రుల ప్రభావం ఉన్న చోటల్లా టీఆర్‌ఎస్‌ గెలిచిందని.. ఇతర చోట్ల బీజేపీ గెలిచిందని విశ్లేషించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్ర సెటిలర్లు కేసీఆర్‌పై కూడా అంత సంతృప్తిగా లేరని, ఈ క్రమంలో బీజేపీ జగన్‌ను వదిలేయడం ద్వారా గెలుపు అవకాశాలు మెరుగుపర్చుకోవాలని సలహా ఇచ్చేశారు. ఈ సలహా బీజేపీ నేతలకు చేరుతుందో లేదో.. నచ్చుతుందో లేదో మనం చెప్పలేం కానీ ఆర్కే చాలా తెలివిగా బీజేపీపై ఓ పాచిక విసిరాడని ఆనుకోవచ్చు.

BJP- Jagan
BJP- Jagan

రాష్ట్రపతి ఎన్నికళ వేళ ఆర్కే కొత్త ఎత్తుగడ..
జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి వైఎస్సార్‌సీపీ ఓట్లు అవసరం.. జగన్‌మోహన్‌రెడ్డి కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వండానికి ఏమాత్రం సంకోచించకపోవచ్చు.. ఎందుకంటే ఆయనకు వ్యక్తిగత అవసరాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం అడగడమే ఆలస్యం అన్ననట్లు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో మూడేళ్లుగా బీజేపీతో జగన్‌ కొనసాగిస్తున్న మైత్రిని విడదీయడమే లక్ష్యంగా రాధాకృష్ణ ఒక పొలిటికల్‌ కథనం వండి వార్చినట్లుగా ఉంది. ఆయన వ్యాసంలో తెలంగాణలో కేసీఆర్‌ పని అయిపోయిందని తేల్చేశారు. పీకే సర్వేలో వరంగల్‌ జిల్లాలో అత్యధిగ మెజార్టీ సాధించిన ఓ నియోజకవర్గంలో ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ 30 వేల మైనస్‌లో పడిపోయిందట.

Also Read: Somu Veerraju- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మూడు ఆప్షన్లపై స్పందించిన సోము వీర్రాజు.. ఇక చంద్రబాబు కోర్టులోనే బంతి?

అలా ఎందుకు పడిపోయిందనేది తెలియక కేసీఆర్‌ కారణాలు అన్వేషిస్తున్నారని అంటున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. కేసీఆర్‌ జాతీయరాజకీయాల పేరుతో వందల కోట్లు ప్రజాధనం ఖర్చు పెడుతూ.. తనను ప్రమోట్‌ చేసుకుంటూడటాన్ని కూడా తప్పు పట్టారు. తెలంగాణ ఎనిమిదో వార్షికోత్సవం రోజున దేశంలో అన్ని పత్రికలకు కేసీఆర్‌ ప్రకటనలు ఇచ్చారు. ఆ ఖర్చు రూ. 250æ కోట్లు తెలంగాణ ప్రజల సొమ్మేనంటున్నారు. దీంతో వదిలి పెట్టడం లేదని.. కనీసం రెండు వేల కోట్లతో తన ఇమేజ్‌ బిల్డింగ్‌ చేసుకోబోతున్నారని ఆర్కే చెబుతున్నారు. ఓ వైపు తెలంగాణ ఆర్థిక కష్టాల్లో ఉంది.

తెలంగాణలో బిల్లులు రాక సర్పంచ్‌లు.. ఆర్థిక సాయం అందక రైతులు టెన్షన్‌ పడుతూంటే.. కేసీఆర్‌ మాత్రం ప్రజాధనాన్ని తన సొంత సొమ్మన్నట్లుగా ఖర్చు పెట్టడం కచ్చితంగా తిరుగుబాటుకు దారి తీస్తుందని ఆయన చెబుతున్నారు. ఈ విషయంలో ప్రజల్లో ఇప్పటికే అసంతృప్తి పెరిగిపోయిందని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ విషయంలో ఇక చేయగలిగిందేమీ లేదని కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారని.. కానీ అది ఆయనన్ను జైలుకు పంపిన ఆశ్చర్యం లేదని ఆర్కే పరోక్షంగా చెబుతున్నారు. ప్రస్తుతం కేసీఆర్‌ అవినీతి చిట్టా.. కమిషన్ల గుట్టు అంతా కేంద్రం సేకరించి పెట్టిందని.. ఎప్పుడైనా సీఎం జగన్‌ కేసుల్లో సాక్ష్యాధారాలతో సహా ఇరుక్కుపోయినట్లుగా ఇరికించడానికి బీజేపీ సిద్ధంగా ఉందని ఆర్కే చెబుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత కేసీఆర్‌కు కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయినట్లేనని.. ఆర్కే చెబుతున్నారు. అప్పుడు తెలంగాణ సమాజం నుంచి కూడా ఆయనకు మద్దతు లభించదని.. పైగా సొంత పార్టీ నేతలు.. కాంగ్రెస్, బీజేపీల్లో జంపవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని తేల్చారు. మొత్తంగా కేసీఆర్‌కు ముందుంది మొసళ్ల పండగ అనేది చెప్పకనే చెప్పారు.

BJP- Jagan
Jagan, modi

బీజేపీకి ఉచిత సలహాలు..
భారతీయ జనతాపార్టీలో ప్రస్తుతం మోదీ, షా ద్వయం వ్యూహాలతో పార్టీని అన్ని ఎన్నికల్లో విజయతీరానికి చేరుస్తున్నారు. ఈ క్రమంలో ఆర్కే వారిని మించిన వ్యూహం తనదగ్గర ఉందనట్లు ఓ వ్యాసాంగం రాసుకొచ్చారు. తెలంగాణపై ప్రస్తుతం బీజేపీ అధిష్టానం దృష్టిపెట్టింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. మరోవైపు అధికార టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెంచేందుకు ఆర్థికంగా చట్టపరంగా, ఇబ్బంది పెడుతోంది. ఇన్ని చేస్తున్న క్రమంలో ఆర్కే బీజేపీ విజయానికి వైఎస్సార్‌సీపీ దోస్తీ ఆటంకం అనే అభిప్రాయం వ్యక్తం చేయడం అటు బీజేపీ, ఇటు వైఎస్సార్‌సీపీ నేతలు ఏమాత్రం విశ్వసించేలా లేదు. ప్రస్తుత పరస్పర సహకారం నేపథ్యంలో బీజేపీ వైసీపీని దూరం చేసుకునే అవకాశం ఏమాత్రం లేదు. అయితే.. మోదీ, షా ద్వయానికి ఎవరిని ఎంతవరకు ఉపయోగించుకోవలనేది మాత్రం స్పష్టంగా తెలుసు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన కాషాయ ద్వయానికి వేమూరి రాధాకృష్ణ చేసిన సూచన తాతకు దగ్గులు నేర్పిన చందంగా ఉంది.

Also Read:Telangana Intellectuals- Jagan: జగన్ కు తెలంగాణ మేధావులు సలహాలు ఎందుకిస్తున్నారు?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version