Megastar Chiranjeevi: ఇప్పటి ప్రతి హీరో ఒకప్పుడు ఓ స్టార్ హీరో అభిమానే. ఆ అభిమాన హీరో స్ఫూర్తితోనే చాలా మంది హీరో కావాలని అనుకుంటారు. మెగా స్టార్ గా కోట్ల మంది అభిమానులు కలిగి ఉన్న చిరంజీవి కూడా ఒక హీరో అభిమానే. అలాగే ఆ హీరో ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా చిరంజీవి వ్యవహరించారట. సినిమాల్లోకి రాక ముందు చిరంజీవి సూపర్ స్టార్ కృష్ణ అభిమాని అట. ఆ అభిమానం ఆయన్ను వెండితెర వైపు నడిపించింది. నటుడిగా మారాక కూడా… చిరంజీవి కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చేశారట.

పద్మాలయ ఫ్యాన్స్ అసోసియేషన్ కి ప్రేమ్ దాస్ అధ్యక్షుడు అట. చిరంజీవి ఈ అసోసియేషన్ కి గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరించారట. ఈ మేరకు విడుదల చేసిన అప్పటి కరపత్రంలో చిరంజీవిని కృష్ణ ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షుడిగా ప్రచురించారు. అలాగే ఆ సమయంలో కృష్ణ, చిరంజీవి కలిసి చేసిన ‘తోడు దొంగలు’ చిత్రం గురించి పొందుపరిచారట. కృష్ణ-చిరంజీవి కలిసి నటించిన తోడు దొంగలు వస్తున్నారంటూ ఆ కరపత్రంలో రాశారట. తాజాగా ఆ కరపత్రం వెలుగులోకి రాగా వైరల్ గా మారింది.
Also Read: Brahmanandam: కమెడియన్స్ లేకపోయినా పర్లేదు కామెడీ ఉండేలా చూడండి… బ్రహ్మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటీ?

ఇప్పటి మెగా స్టార్ అప్పటి సూపర్ స్టార్ అభిమాని కావడం మహేష్ ఫ్యాన్స్ గర్వంగా ఫీల్ అయ్యే న్యూస్ అని చెప్పొచ్చు. అందుకే చిరంజీవి-కృష్ణ పరిశ్రమలో మంచి మిత్రులుగా ఉన్నారు. కృష్ణ పట్ల చిరంజీవి అత్యంత గౌరవాభిమానాలు ప్రదర్శిస్తారు. ఈ జనరేషన్ లో చరణ్ కి మహేష్ గొప్ప మిత్రుడు కావడం విశేషం. మహేష్ అత్యంత ఇష్టపడే హీరోల్లో చరణ్, ఎన్టీఆర్ ఉన్నారు. వీరిద్దరితోనే ఆయన స్నేహం చేస్తారు. ఈ ముగ్గురు తమ కుటుంబాలతో పాటు తరచుగా కలుస్తూ ఉంటారు.
Also Read:Deepthi Sunaina: హద్దులు దాటేసిన బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైన.. బోల్డ్ ఫోటో షూట్ తో టెంపరేచర్ పెంచేసింది!
Recommended Videos



[…] […]
[…] […]