Homeజాతీయ వార్తలుPM Modi temple: ప్రధాని మోడీకి గుడికట్టాడు.. రాత్రికి రాత్రి తొలగింపు.. ఏం జరిగిందంటే?

PM Modi temple: ప్రధాని మోడీకి గుడికట్టాడు.. రాత్రికి రాత్రి తొలగింపు.. ఏం జరిగిందంటే?

Modi Templeశ్రీరాముడిపై ఉన్న భక్తిని హనుమంతుడు ఎలా చాటాడో మనకు తెలుసు కదా. అలాంటి భక్తుడొకడు తన అభిమానాన్ని చాటే క్రమంలో విగ్రహం చేయించి చూపాడు. తన భక్తికి లెక్కలేదని నిరూపించేందుకు గుండెలో గుడి కట్టించిన సందర్భాలున్నా ఏకంగా తన రాజకీయ నేతకు దేవాలయమే కట్టించాడు. దీంతో కంగారు పడిన పార్టీ నేతలు రాత్రికి రాత్రి దాన్ని తొలగించినా ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నరేంద్రమోడీ విగ్రహం ఏర్పాటుకు చొరవ చూపడం నిజంగా ఆహ్వానించదగినదే అయినా పార్టీ సూచన మేరకు మళ్లీ అక్కడి నుంచి తొలగించారు.

మహారాష్ర్టలోని పుణేలో బీజేపీ కార్యకర్త మయూర్ ముండే అనే కార్యకర్త ప్రధాని మోడీకి(PM Modi) వీరాభిమాని. తనలోని భక్తిని చాటుకునే క్రమంలో అతడు మోడీకి ఓ గుడి(Temple) కట్టించాలని భావించాడు. అనుకున్నదే తడవుగా ఏకంగా రూ.1.60 లక్షలు ఖర్చు చేసి దేవాలయం నిర్మించాడు. అందులో మోడీ విగ్రహాన్ని నె లకొల్పాడు. దీంతో ఇది సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసింది. దీని కోసం అతడు జైపూర్ మార్బల్ ను ఉపయోగించాడు.

అయోధ్యలో రాముడికి ఆలయం నిర్మిస్తున్న వ్యక్తికి మనం కూడా సముచిత గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతోనే మయూర్ మోడీకి గుడి కట్టించినట్లు తెలిపాడు. ఇంతవరకు బాగానే ఉన్నా మోడీ విగ్రహాన్ని మాత్రం రాత్రి తొలగించారు. ఇదంతా ఎవరో చేశారని అనుకుంటే పొరపాటే. ఆ పార్టీ కార్యకర్తలే తొలగించి బీజేపీ కౌన్సిలర్ ఇంటికి తరలించారు. దీంతో కార్యకర్తల్లో నిరాశే మిగిలింది. కానీ మొత్తానికి తన భక్తిని చాటుకున్న భక్తుడికి ప్రశంసలు వస్తున్నాయి.

త్వరలో మహారాష్ర్టలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విగ్రహం ఉండొద్దనే అధిష్టానం సూచనతో తొలగించారనే తెలుస్తోంది. అధికారుల సూచన మేరకు బుధవారం రాత్రి విగ్రహం తొలగించారు. దీంతో గురువారం అటు వైపు వెళ్లిన వారు విగ్రహం తొలగించడాన్ని గుర్తించారు. అయితే బీజేపీ అధిష్టానం నిర్ణయంతోనే విగ్రహం తీసినట్లు చెబుతున్నారు.

మోడీ విగ్రహం తొలగించడంతో ప్రతిపక్షాలు సైతం స్పందించాయి. విగ్రహం ఉంటే పెరిగిపోతున్న ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఆహార పదార్థాల ధరలు తగ్గించాలని వేడుకునే వారమని ఎన్ సీపీ పార్టీ నాయకులు అన్నారు. నిరుద్యోగాన్ని కట్టడి చేయడంలో కూడా మోడీ ప్రభుత్వం విఫలమైందని చెబుతూ వినతిపత్రం సమర్పించేవారమని వ్యంగ్యాస్రాలు విసిరారు.

మొత్తానికి బీజేపీ అధిష్టానం ఎలాంటి గొడవలు లేకుండా చూడాలనే ఉద్దేశంతో మోడీ విగ్రహం తొలగించేందుకు చర్యలు తీసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే మయూర్ మాత్రం తన భక్తి పారవశ్యాన్ని చాటుకునే క్రమంలో అంత ఖర్చు చేసినా దానికి ప్రతిఫలం లేకుండా చేశారని వాపోతున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version