https://oktelugu.com/

బీజేపీ వ్యూహం.. టీఆర్ఎస్ దాహం

రాజకీయాలంటేనే ఎత్తులకు పైఎత్తులు. వ్యూహాల అమలుతో ప్రత్యర్థి పార్టీలను భయాందోళనకు గురిచేయడం చూస్తుంటాం. ప్రస్తుతం హుజురాబాద్ లో ఇదే పరిస్థితి. ఇప్పుడు రాష్ర్ట రాజకీయం మొత్తం హుజురాబాద్ లోనే నడుస్తోంది. పార్టీలు తమ విధానాలు, వైఖరులను ప్రజలకు చేరవేసే క్రమంలో ఎన్నో మార్గాలు వెతుకుతున్నాయి. అధికార పార్టీ అయితే తన ప్రభావం చూపించేందుకు పావులు కదుపుతోంది. అసలు హుజురాబాద్ ఉప ఎన్నిక రావడానికి కారణం ఏంటి అనేది అందరికి తెలిసిందే. హుజురాబాద్ లో ఈటలను దెబ్బతీయడానికి కేసీఆర్ […]

Written By: , Updated On : August 1, 2021 / 04:19 PM IST
Follow us on

Huzurabad By-Elections

రాజకీయాలంటేనే ఎత్తులకు పైఎత్తులు. వ్యూహాల అమలుతో ప్రత్యర్థి పార్టీలను భయాందోళనకు గురిచేయడం చూస్తుంటాం. ప్రస్తుతం హుజురాబాద్ లో ఇదే పరిస్థితి. ఇప్పుడు రాష్ర్ట రాజకీయం మొత్తం హుజురాబాద్ లోనే నడుస్తోంది. పార్టీలు తమ విధానాలు, వైఖరులను ప్రజలకు చేరవేసే క్రమంలో ఎన్నో మార్గాలు వెతుకుతున్నాయి. అధికార పార్టీ అయితే తన ప్రభావం చూపించేందుకు పావులు కదుపుతోంది. అసలు హుజురాబాద్ ఉప ఎన్నిక రావడానికి కారణం ఏంటి అనేది అందరికి తెలిసిందే.

హుజురాబాద్ లో ఈటలను దెబ్బతీయడానికి కేసీఆర్ వ్యూహాలు మారుస్తున్నారు. ఈటల నియోజకవర్గంలో అందరికి సుపరిచితమే. దీంతో ఆయనను ఢీకొట్టడం అంత సులువు కాదని తెలుసుకుని ప్రతి ఓటరును చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈటలకు ఉన్న పరిచయాల దృష్ట్యా ఆయనకు సమ ఉజ్జీ అయిన అభ్యర్థి కోసం వెతుకులాడుతున్నారు.

సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టి వారి ఓట్లను కొల్లగొట్టాలని భావిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ లో అమలు చేయాలని సంకల్పించడంతో దళితులను తమ పక్షానికి తిప్పుకోవడం కోసం కేసీఆర్ ఈ పథకం తీసుకొచ్చారని తెలుస్తోంది. దీంతో ఎన్నికల వ్యూహంలోనే భాగంగా ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఓట్ల పరంగా చూసుకుంటే హుజురాబాద్ లో 45 వేల మంది దళిత ఓటర్లుండడంతో వారి కోసమే ఈ పథకం తీసుకొస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

దళితబంధు పథకం ఆవిర్భావానికి కారణం బీజేపీనే అని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీ వ్యూహాన్ని దెబ్బతీసే క్రమంలో ఈటల రాజీనామా చేయకపోతే ఈ పథకం వచ్చేది కాదు. దళితులు కేసీఆర్ కు గుర్తుకు వచ్చే వారు కాదని ఎదురుదాడి చేస్తున్నారు. దీంతో కేసీఆర్ వ్యూహాన్ని పక్కాగా పసిగట్టి దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలనే తాపత్రయంతో ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది.

దళితబంధుతో ఎస్సీలకు మేలు చేసినట్లే బీసీలకు కూడా చేయాలని కోరుతున్నారు. రూ.10 లక్షలు అందరికి ఎస్సీ, బీసీ, ఎస్టీలకు కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి సరికొత్త సవాలు ఎదురవుతోంది. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఏదిఏమైనా ప్రభుత్వం ముందు పెద్ద సమస్య వచ్చి పడింది. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా పరిస్థితి మారింది.