https://oktelugu.com/

ఆధార్ ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. మొబైల్ నంబర్ ఎలా అప్ డేట్ చేయాలంటే?

మన దేశంలో నివశించే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డును కలిగి ఉంటారనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డును కలిగి ఉన్నవాళ్లు మొబైల్ నంబర్ ను ఆధార్ కార్డుకు కచ్చితంగా లింక్ చేసుకుంటే మంచిది. ఆధార్ కార్డులో పేరు, పుట్టినరోజు, ఇతర వివరాలు తప్పుగా నమోదై ఉన్నా ఆ వివరాలలో మార్పులు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా ఉంటే అత్యవసర సమయాల్లో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆధార్ కార్డులోని […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 21, 2021 / 11:41 AM IST
    Follow us on

    మన దేశంలో నివశించే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డును కలిగి ఉంటారనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డును కలిగి ఉన్నవాళ్లు మొబైల్ నంబర్ ను ఆధార్ కార్డుకు కచ్చితంగా లింక్ చేసుకుంటే మంచిది. ఆధార్ కార్డులో పేరు, పుట్టినరోజు, ఇతర వివరాలు తప్పుగా నమోదై ఉన్నా ఆ వివరాలలో మార్పులు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా ఉంటే అత్యవసర సమయాల్లో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

    ఆధార్ కార్డులోని మొబైల్ నంబర్ ను ఇంటినుంచే సులభంగా అప్ డేట్ చేసుకునే అవకాశం ఉంది. యూఐడీఏఐ ఆధార్ కార్డ్ వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా యూఐడీఏఐ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తో ఒప్పందం చేసుకుని ఇంటినుంచే ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ అప్ డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

    గ్రామీణ డాక్ సేవక్స్ తో పాటు దేశంలో ఉన్న లక్షల సంఖ్యలో పోస్ట్ మ్యాన్ల నుంచి సులభంగా ఈ సర్వీసులను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. యూఐడీఏఐ ఆధార్ కార్డ్ ఉన్నవాళ్లకు సులువుగానే సేవలను అందించడానికి ప్రయత్నాలు చేస్తోంది. యూఐడీఏఐ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు పొందాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి.

    ఇంట్లోని చిన్న పిల్లలకు కూడా కచ్చితంగా ఆధార్ కార్డును తీసుకుంటే మంచిది. రాబోయే రోజుల్లో చిన్నపిల్లలకు కూడా ఆధార్ ఎన్ రోల్ మెంట్ సేవలు పోస్ట్ మ్యాన్ల ద్వారా అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది.