https://oktelugu.com/

BJP vs TRS: విద్యుత్ చార్జీల పెంపును టార్గెట్ చేసుకున్న బీజేపీ.. టీఆర్ఎస్ పై ప్రతీకారం

BJP vs TRS: తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. రెండు పార్టీలు ఒకదానిపై మరొకటి టార్గెట్ చేసుకుని దూషించుకుంటున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక నుంచి బీజేపీని ఎలాగైనా అడ్డుకోవాలని టీఆర్ఎస్ ధాన్యం కొనుగోలు అంశాన్ని తెరమీదకు తెచ్చింది. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు కేంద్రంపై టీఆర్ఎస్ పెట్రో ధరలు తగ్గించాలని పోరాటం చేస్తుంటే పెంచిన కరెంటు చార్జీలు తగ్గించాలని బీజేపీ ధర్నాలు చేస్తోంది. దీంతో రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. విద్యుత్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 25, 2022 / 05:22 PM IST
    Follow us on

    BJP vs TRS: తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. రెండు పార్టీలు ఒకదానిపై మరొకటి టార్గెట్ చేసుకుని దూషించుకుంటున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక నుంచి బీజేపీని ఎలాగైనా అడ్డుకోవాలని టీఆర్ఎస్ ధాన్యం కొనుగోలు అంశాన్ని తెరమీదకు తెచ్చింది. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు కేంద్రంపై టీఆర్ఎస్ పెట్రో ధరలు తగ్గించాలని పోరాటం చేస్తుంటే పెంచిన కరెంటు చార్జీలు తగ్గించాలని బీజేపీ ధర్నాలు చేస్తోంది. దీంతో రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి నెలకొంది.

    BJP vs TRS

    విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ బీజేపీ అన్ని జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు చేస్తోంది. బీజేపీ జిల్లా కార్యాలయాల నుంచి కలెక్టరేట్ల వరకు ర్యాలీలు నిర్వహించి సర్కారు విధానాలను ఎండగడుతోంది. విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తోంది. ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

    బీజేపీ నేతలు చేస్తున్న ఆందోళనలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. టీఆర్ఎస్ కూడా పెంచిన పెట్రో ధరలు తగ్గించాలని కేంద్రంపై ఒత్తిడి పెంచాలని చూస్తోంది. ఇందులో భాగంగా నిన్ననే ధర్నాలు చేపట్టింది. దీంతో ఇరు పార్టీల్లో వైరుద్యాలు పెరుగుతున్నాయి. రాజకీయంగా తమ ప్రభావం చూపాలని చూస్తున్నాయి. దీని కోసమే సమస్యలను ఎంచుకుని పోరాటానికి దిగుతున్నాయి.

    KCR

    మొత్తానికి రాష్ట్రంలో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. రెండు పార్టీలే కాకుండా కాంగ్రెస్ సైతం ఆందోళనలు చేస్తోంది. పెట్రో, గ్యాస్ ధరలతో పాటు కరెంటు చార్జీలు తగ్గించాలని ఆందోళన చేస్తోంది. రాబోయే రోజుల్లో వీటినే ప్రధానాంశాలుగా చేసుకుని ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ధరల పెరుగుదల అంశం రాష్ట్రాన్నే కుదిపేస్తోంది. కరెంటు చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తప్పుబడుతోంది. దీంతో రాష్ట్రంలో రెండు పార్టీల్లో కొనసాగుతున్న పరిణామాల దృష్ట్యా భవిష్యత్ లో ఇంకా ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

    Tags