https://oktelugu.com/

AP Liquor Policy: మద్యం వ్యాపారమే ఏపీ సర్కారుకు ఇంధనమా?

AP Liquor Policy:   ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధానికి తూట్లు పొడుస్తున్నారు. మద్యంతోనే రాష్ట్రం బతుకుతోందని భరోసా కల్పిస్తున్నారు. ఇందుకోసమే మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. దీనిపై విమర్శలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రజల ఆగ్రహానికి బలవుతున్నారు. మద్యం వ్యాపారం మీదే ఆధారపడి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సాగుతున్నాయనేది ఆయన మాటల్లో అంతరార్థం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్యనిషేధం చేస్తామని చెప్పినా తరువాత అధికారంలోకి వచ్చాక ఆ మాటే […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 25, 2022 / 05:31 PM IST
    Follow us on

    AP Liquor Policy:   ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధానికి తూట్లు పొడుస్తున్నారు. మద్యంతోనే రాష్ట్రం బతుకుతోందని భరోసా కల్పిస్తున్నారు. ఇందుకోసమే మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. దీనిపై విమర్శలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రజల ఆగ్రహానికి బలవుతున్నారు. మద్యం వ్యాపారం మీదే ఆధారపడి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సాగుతున్నాయనేది ఆయన మాటల్లో అంతరార్థం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్యనిషేధం చేస్తామని చెప్పినా తరువాత అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచిపోయారు.

    AP Liquor Policy

    ప్రస్తుతం రాష్ట్రంలో మద్య నిషేధంపై టీడీపీ ప్రశ్నిస్తుంటే చంద్రబాబు నాయుడుకు రాష్ట్రానికి ఆదాయం వచ్చే మార్గాలను మూసేయాలని ఉందని ఎద్దేవా చేస్తున్నారు. అక్కా చెల్లెళ్లకు అందజేస్తున్న పథకాలు మద్యం ద్వారా వచ్చే ఆదాయంతోనే అన్న సంగతి గుర్తు చేస్తున్నారు. దీంతో జగన్ పూర్తిగా మద్య నిషేధాన్ని మరిచిపోయారు. ఆదాయాన్నే ప్రధానంగా చూసుకుంటున్నారు. ఇప్పటికే పలు బ్యాంకుల్లో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని తనఖా పెట్టి అప్పులు చేసినట్లు తెలుస్తోంది దీంతోనే ఆయన మద్య నిషేధానికి తూట్లు పొడుస్తున్నారనే విమర్శలు సైతం వస్తున్నాయి.

    Also Read: ఆ సీన్లతో అందరి నోళ్లు మూయించిన రాజమౌళి.. నువ్వు తోపు సామీ..

    దీనిపై ప్రతిపక్షాలతో పాటు నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కు వచ్చే ఆదాయంపైనే కన్ను ఉందని పోయే విలువలపై లేదని వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. అయితే ఒక్క ఏపీనే మద్యంపై ఆధారపడుతోంది. మిగతా రాష్ట్రాలేవి కూడా మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని సాకుగా చూపి పరిపాలన చేయడం లేదనే సంగతి తెలిసిందే. కేంద్రం కూడా మద్యం ద్వారా పైసా కూడా సంపాదించుకోలేదు. కానీ ప్రభుత్వాన్ని నిర్వహించడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు.

    Y S Jagan

    మద్యం ద్వారా వచ్చే డబ్బులతోనే ప్రభుత్వాన్ని నడపడం జగన్ కే చెల్లిందనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మలుచుతున్నారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మద్యంపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఎన్ని రోజులు నడుపుతారనే సంశయాలు వస్తున్నాయి. అభివృద్ధి పథకాలు జాడేలేకున్నా సంక్షేమ పథకాలను నమ్ముకుని ఎలా గట్టెక్కుతారో తెలియడం లేదు. రాబోయే ఎన్నికల్లో మద్యం పాలసీ జగన్ కు గుదిబండలా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

    Also Read:  ‘నాటు నాటు’ సాంగ్ కి స్టెప్స్ జక్కన్న అక్కడ నుంచి తీసుకున్నారా ?

    Tags