BJP One Nation One Election:: దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో బీజేపీ నాలుగు స్టేట్లలో విజయం సాధించగా ఆప్ ఒక రాష్ర్టంలో గెలిచి అందరి అంచనాలు నిజం చేశాయి. దీంతో కేంద్రం ఇప్పుడు దూకుడు మీద ఉంది. నిర్ణయాలు తీసుకునేందుకు వేగవంతంగా కదులుతోంది. ఎన్నో రోజులుగా నాన్చుతూ వస్తున్న జమిలి ఎన్నికల కార్యాచరణ ప్రణాళిక రూపొందించనుంది. దీని కోసం ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దేశంలో ఎన్నికల ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అవుతోంది. జమిలి ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది.

నరేంద్రమోడీ రెండో సారి ప్రధానిగా అయిన తరువాత నుంచే జమిలి ఎన్నికలపై ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాంగానే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర సైతం జమిలి ఎన్నికలకు తాము సిద్ధమేనని ప్రకటించిన సందర్భంలో బీజేపీ నిర్ణయంపై అందరిలో అంచనాలు పెరుగుతున్నాయి. జమిలి ఎన్నికలకు కేంద్రం రెడీ అంటున్నందున దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒకేసారి నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఆశలు అడియాశలేనా? ముందే సర్దుకున్నాడా?
బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాల్లో జమిలి ఎన్నికలు ఒక భాగమే అని తెలుస్తోంది. అయోధ్యలో రామాలయం, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న బీజేపీ ప్రస్తుతం జమిలి ఎన్నికలను నిర్వహించాలని యోచిస్తోంది. ఇందు కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. భవిష్యత్ లో జరిగే ఎన్నికలను జమిలిగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోందని చెబుతున్నారు. కేంద్రం నుంచి అందుతున్న సమాచారం మేరకు జమిలి ఎన్నికలు నిర్వహించేందుకే మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా జమిలి ఎన్నికలకు సిద్ధమే అని ప్రకటిస్తున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టత ఇచ్చారు. దీంతో భవిష్యత్ లో బీజేపీ తీసుకునే ఏ నిర్ణయానికైనా రెడీ అయినట్లు చెబుతున్నారు. చంద్రబాబు సైతం జమిలి ఎన్నికలకు సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల ప్రభావం ఇప్పుడు దేశమంతా విస్తరించనుంది. దీనికి అన్ని పార్టీలు సంసిద్ధత వ్యక్తం చేస్తున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయంపై భరోసా కనబరుస్తున్నట్లు కనిపిస్తోంది.
జమిలి ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత మేర కలిసొస్తుందో తెలియడం లేదు. ఇప్పుడు కేంద్రం జమిలి ఎన్నికల కోసం కార్యాచరణ ప్రణాళిక రచిస్తోంది. జాతీయ స్థాయిలో చోటుచేసుకుంటున్న పరిణామాల సందర్భంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందో తెలియడం లేదు. ఏదిఏమైనా జమిలి ఎన్నికల ప్రభావం పార్టీలపై కూడా పడుతుందనే అంచనాలు వస్తున్నాయి.
Also Read: కాంగ్రెస్ ఖేల్ ఖతం.. దేశంలో బీజేపీకి పోటీగా ఆమ్ ఆద్మీయేనా?
[…] Also Read: బీజేపీ జమిలి ఎన్నికలకు సిద్ధమేనా? […]