స్వీయ గృహ నిర్బంధంలో కేంద్ర మాజీ మంత్రి

కరోనా వైరస్ విజృభిస్తున్న నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు స్వీయ గృహనిర్బంధంలోకి వెళ్లారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ సౌదీ పర్యటన నిమిత్తం మార్చి 10న వెళ్లారు. సౌదీలో ఏర్పాటు చేసిన జీ 20 దేశాల సమ్మేళనం సన్నాహక సమావేశానికి సురేశ్‌ ప్రభు హాజరయ్యారు. సౌదీ వెళ్లి వచ్చిన నేపథ్యంలో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఆ ఫలితాల్లో కరోనా నెగిటివ్‌ వచ్చింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త […]

Written By: Neelambaram, Updated On : March 18, 2020 3:46 pm
Follow us on

కరోనా వైరస్ విజృభిస్తున్న నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు స్వీయ గృహనిర్బంధంలోకి వెళ్లారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ సౌదీ పర్యటన నిమిత్తం మార్చి 10న వెళ్లారు.

సౌదీలో ఏర్పాటు చేసిన జీ 20 దేశాల సమ్మేళనం సన్నాహక సమావేశానికి సురేశ్‌ ప్రభు హాజరయ్యారు. సౌదీ వెళ్లి వచ్చిన నేపథ్యంలో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఆ ఫలితాల్లో కరోనా నెగిటివ్‌ వచ్చింది.

అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు స్వీయ నిర్బంధంలో ఉండాలని సురేశ్‌ ప్రభు నిర్ణయించుకున్నారు. 14 రోజుల స్వీయ నిర్బంధంలోకి కేంద్ర మాజీ మంత్రి వెళ్లారు.

అంతకుముందు కేరళ రాష్ట్రంలోని ఓ ఆసుపత్రిలో కరోనా వైరస్ పాజిటివ్ రోగులను పరిశీలించేందుకు వచ్చిన కేంద్రమంత్రి వి. మురళీ ధరన్ కూడా ఐసోలేషన్ గదిలో చేరారు. కేంద్రమంత్రితోపాటు ఉన్న ఓ డాక్టరుకు కరోనా పాజిటివ్ అని రిపోర్టు వచ్చిన దృష్ట్యా కేంద్రమంత్రి సెల్ఫ్ క్వారంటైన్ అయ్యారు.