https://oktelugu.com/

పార్టీ మారిన బీజేపీ ఎంపీ భార్య.. విడాకులిచ్చిన భర్త

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ పార్టీల లొల్లి ఓ పచ్చని ఎంపీ సంసారంలో చిచ్చు పెట్టాయి. ఓ బీజేపీ ఎంపీ భార్య తనకు కమలం పార్టీ నచ్చడం లేదంటూ తాజాగా ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంచలనమైంది. దీంతో తన పరువు పోయిందని భావించిన సదురు బీజేపీ ఎంపీ ఏకంగా భార్యకు విడాకులు నోటీసులు ఇచ్చేయడం హాట్ టాపిక్ గా మారింది. Also Read: వాహనదారులకు అలర్ట్.. ఆ తప్పు చేస్తే రూ.5000 జరిమానా..? […]

Written By:
  • NARESH
  • , Updated On : December 22, 2020 / 09:00 PM IST
    Follow us on

    పశ్చిమ బెంగాల్ లో బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ పార్టీల లొల్లి ఓ పచ్చని ఎంపీ సంసారంలో చిచ్చు పెట్టాయి. ఓ బీజేపీ ఎంపీ భార్య తనకు కమలం పార్టీ నచ్చడం లేదంటూ తాజాగా ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంచలనమైంది. దీంతో తన పరువు పోయిందని భావించిన సదురు బీజేపీ ఎంపీ ఏకంగా భార్యకు విడాకులు నోటీసులు ఇచ్చేయడం హాట్ టాపిక్ గా మారింది.

    Also Read: వాహనదారులకు అలర్ట్.. ఆ తప్పు చేస్తే రూ.5000 జరిమానా..?

    బెంగాల్ బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ తాజాగా తన భార్య సుజాతా మొండల్ ఖాన్ కు మధ్య రాజకీయాలు చిచ్చుపెట్టాయి. మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీలో సుజాత చేరడంతో కలత చెందిన బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ విడాకులు ఇచ్చేశారు. భార్యకు తన ఇంటిపేరు వాడుకోకూడదని సూచించాడు సౌమిత్రా ఖాన్.

    బిష్ణు పూర్ ఎంపీ అయిన సౌమిత్రాఖాన్ బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు కూడా.. వచ్ఛే ఏడాది జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ ఎంపీ భార్య ఇలా చేయడం ఆయనకు ఏమాత్రం నచ్ఛలేదట. పార్టీలో పరువు పోయిందట.. భార్యను కంట్రోల్ లో పెట్టుకోలేని బీజేపీ ఎంపీ అంటూ ఎద్దేవా చేశారట..

    Also Read: బ్రిటన్ ప్రధానికి ఢిల్లీ రైతుల సెగ..!

    అయితే భార్య వాదన మరోలా ఉంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో తన భర్త విజయానికి ఎన్నో రిస్కులు తీసుకున్నప్పటికీ తనకు సరైన గుర్తింపు రాలేదని సుజాత ఆరోపించింది. అందుకే సోమవారం తృణమూల్ కాంగ్రెస్ లో చేరానని ఆమె చెప్పుకొచ్చింది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్