KCR vs BJP: కేసీఆర్ కు నిజంగా ఆ భయం పట్టుకుందా?

KCR vs BJP: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. శాసనసభలో బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నా వారిని సభ నుంచి గెంటేయించి తప్పు చేశారనే అభిప్రాయం వస్తోంది. కేసీఆర్ కు మతిభ్రమించిందా అనే అనుమానాలు సైతం వస్తు న్నాయి. గతంలో కూడా ఆయనకు నచ్చని వారిని సభ నుంచి పంపించడం అలవాటే.నీ ఇంతవరకు బాగానే ఉన్నా ఇటీవల ఆయన మనస్తత్వంలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీకి మధ్య దూరం పెరగడంతో సహజంగానే రెండు […]

Written By: Srinivas, Updated On : March 8, 2022 1:00 pm
Follow us on

KCR vs BJP: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. శాసనసభలో బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నా వారిని సభ నుంచి గెంటేయించి తప్పు చేశారనే అభిప్రాయం వస్తోంది. కేసీఆర్ కు మతిభ్రమించిందా అనే అనుమానాలు సైతం వస్తు
న్నాయి. గతంలో కూడా ఆయనకు నచ్చని వారిని సభ నుంచి పంపించడం అలవాటే.నీ ఇంతవరకు బాగానే ఉన్నా ఇటీవల ఆయన మనస్తత్వంలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.

KCR vs BJP

టీఆర్ఎస్, బీజేపీకి మధ్య దూరం పెరగడంతో సహజంగానే రెండు పార్టీల నేతల్లో ఒకరిపై మరొకరికి కోపం కూడా పె రుగుతోంది. దీంతోనే నేతల్లో కూడా వైరం ఎక్కువవుతోంది. సభలో హుందాగా ప్రవర్తించి గౌరవాన్ని కాపాడాల్సి ఉన్నా ఇలా అసహజ రీతిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని సభ నుంచి బయటకు పంపించడంపై విమర్శలు వస్తున్నాయి.

Also Read: కేసీఆర్ ‘ప్రధాని’ ఆశ అడియాశలేనా? ఒకవేళ మోడీ ఓడిపోతే కేజ్రీవాల్ కే ఛాన్స్?

కేసీఆర్ కు బీజేపీ అంటే భయం పెరిగిపోతోందా అనే సందేహాలు వస్తున్నాయి. దీంతోనే ఇలా ప్రవర్తిస్తున్నారని చెబుతున్నారు. బీజేపీని టార్గెట్ చేసుకుని జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలని చూస్తున్నా అవి నెరవేరేలా కనిపించడం లేదు. అందుకే ఆయన ఇలా కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

బీజేపీ ఎమ్మెల్యేలు జరిగిన దానిపై గవర్నర్ కు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. ఆమెనే కేసీఆర్ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో ఆమె మాత్రం ఏం చేస్తుంది? మొత్తానికి కేసీఆర్ కు వెన్నులో వణుకు మాత్రం పుట్టిందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి బయటకు పంపించారనే వాదన కూడా వస్తోంది.

KCR vs BJP

మరోవైపు టీఆర్ఎస్ ను ఖంగు తినిపించిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మొహం చూడలేకే కేసీఆర్ ఇలా చేశారని ఊహాగానాలు వస్తున్నాయి. గతంలో కూడా ఇలా తనకు పడని వారిని సభ నుంచి పంపించిన ఘనత కేసీఆర్ కే సొంతం.. భవిష్యత్ లో టీఆర్ఎస్ కు గడ్డు రోజులు వస్తున్నాయనే సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయని విశ్లేషకుల అభిప్రాయం.

Also Read: జనసేన-తెలుగుదేశం కలిసి పోటీచేస్తాయా? చేస్తే ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

Tags