BJP Leaders: ఆంధ్రా ‘వాల్మీకీ’ కులస్థులు ఏం పాపం చేశారు? సమస్య పరిష్కారానికి చొరవ చూపిన బీజేపీ నేతలు

BJP Leaders: దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వాల్మీకులు ఎస్టీలు.. కానీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి బీసీలుగా పరిగణిస్తున్నారు. ఈ వివక్ష ఏంటి? ఎస్టీలు ఎక్కడైనా ఎస్టీలే. కానీ ఆంధ్రాలో మాత్రం ఈ వివక్ష ఏంటి? దశాబ్ధాలుగా రిజర్వేషన్లు కోల్పోతున్న వాల్మీకుల సమస్యలను భుజానకెత్తుకున్న బీజేపీ నేతలు తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దృష్టికి దీన్ని తీసుకెళ్లారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ఎస్టీల్లోకి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. వాల్మీకుల ఎస్టీ హోదా పునరుద్ధరించాలని […]

Written By: NARESH, Updated On : June 8, 2022 8:07 pm
Follow us on

BJP Leaders: దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వాల్మీకులు ఎస్టీలు.. కానీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి బీసీలుగా పరిగణిస్తున్నారు. ఈ వివక్ష ఏంటి? ఎస్టీలు ఎక్కడైనా ఎస్టీలే. కానీ ఆంధ్రాలో మాత్రం ఈ వివక్ష ఏంటి? దశాబ్ధాలుగా రిజర్వేషన్లు కోల్పోతున్న వాల్మీకుల సమస్యలను భుజానకెత్తుకున్న బీజేపీ నేతలు తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దృష్టికి దీన్ని తీసుకెళ్లారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ఎస్టీల్లోకి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.

వాల్మీకుల ఎస్టీ హోదా పునరుద్ధరించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను కలిసి బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారథి, ఈశ్వరయ్య , రామచంద్ర, ప్రొఫెసర్ జగదీష్ , హనుమంతప్ప విన్నవించారు. వాల్మీకులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ , ఎస్టీలు గా కొనసాగుతున్నారన్నారు. పక్క రాష్ట్రం కర్నాటకలో కూడా వాల్మీకులు రాజ్యాంగబద్ధంగా ఎస్టీ హోదాలో ఉన్నారని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో కూడా కొత్తగా ఏర్పడిన 10 జిల్లాల్లో ఎస్టీలుగా పరిగణించబడుతున్నారని.. మిగిలిన 16 జిల్లాల్లో మాత్రమే బీసీలుగా ఉన్నారని నడ్డా దృష్టికి తీసుకెళ్లారు. ఒకప్పుడు ఎస్టీలుగా ఉన్న వారిని 1968 సంవత్సరంలో రాయలసీమ జిల్లాల్లో బీసీలుగా హోదా మార్చి అన్యాయం చేశారన్నారు. ఎటువంటి కుల వృత్తి లేకుండా , జీవనోపాధి లేకుండా పేదరికాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు.

ఇక్కడి వాల్మీకులను మిగతా జిల్లాలు.. రాష్ట్రాలతో సరిసమానంగా ఎస్టీ హోదా కల్పించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఎంతో కాలంగా డిమాండ్ చేస్తూనే ఉన్నామని బీజేపీ నేతలు నడ్డా దృష్టికి తీసుకొచ్చారు. ఈ న్యాయమైన డిమాండ్ తో దశాబ్దాలుగా రాయలసీమలో ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. వాల్మీకులకు ఎస్టీ హోదా తిరిగి కల్పించాలని కోరుతూ ఈరోజు భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ను బీజేపీ నేతలు కలిసి వినతి పత్రం ఇచ్చారు. జేపీ నడ్డా దీన్ని తప్పకుండా పరిశీలిస్తామని చెప్పారు. బీజేపీ నేతల చొరవతోనైనా వాల్మీకుల సమస్య తీరితే వారంతా కమలం పార్టీ నేతలకు రుణపడి ఉంటామని అంటున్నారు.