TRS Targeting BJP: బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా మారిపోయాయి. రాష్ర్టంలో అధికారం కోసం రెండు పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే బీజేపీని ముప్పతిప్పలు పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దీనికి గాను బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ జనజాగరణ దీక్ష పేరుతో నిరాహార దీక్ష చేపట్టేందుకు సంకల్పించగా అధికార పార్టీ తన బలం ప్రదర్శించి ఆయనను అరెస్టు చేయించింది. దీంతో రాష్ర్టవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.
దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంగళవారం కరీంనగర్ జైలులో బండి సంజయ్ ను పరామర్శించారు. అధికార పార్టీ తీరుపై నిప్పులు చెరిగారు. రాష్ర్ట ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. రాచరిక, నియంతృత్వ పాలనకు త్వరలోనే చరమగీతం పాడాల్సి వస్తుందన్నారు. అధికార పార్టీ ఆగడాలకు బీజేపీ అడుగడుగునా అడ్డంకులు ఎదుర్కొంటోంది.
Also Read: బీజేపీకి గట్టి షాకిచ్చిన కేసీఆర్.. ఏకంగా జేపీ నడ్డాకే ఝలక్
తప్పుడు కేసులతో ఎన్నాళ్లు నెట్టుకొస్తుందో వేచి చూడాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ప్రజాగ్రహం పెల్లుబికితే టీఆర్ఎస్ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది. కరోనా నిబంధనల పేరుతో బీజేపీని ఏకాకిని చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. దీనికోసం బీజేపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోంది. ప్రజలు గమనిస్తున్నారు. ఏది బూర్జువా పార్టీయో అని తెలుసుకుంటున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది.
నిజాం పాలనను తలపించేలా కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారనే వాదనలు వస్తున్నాయి. 317 జీవోతో ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతన్నారని వారి సమస్యలు తీర్చే క్రమంలో జీవో మార్చాలని డిమాండ్ చేయడం నేరమా అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ అనాలోచిత నిర్ణయాలతో అందరు బాధపడుతున్నారని తెలుస్తోంది. బీజేపీ చేస్తున్న పోరాటానికి ప్రజలనుంచి మద్దతు పెరుగుతోంది.
Also Read: బండి సంజయ్ ని ఇంత పకడ్బందీగా ఇరికించారా? జైల్లో ప్రాణాలకు విషాహారం ముప్పు?