https://oktelugu.com/

Sudigali Sudheer: ఢీ మానేశాను కానీ అది మాత్రం మానను అంటున్న సుడిగాలి సుధీర్… అది ఏంటంటే ?

Sudigali Sudheer: ఈ టీవి ఛానల్ లో ప్రసారం అవుతున్న డాన్స్ రియాలిటీ షో “ఢీ” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పదేళ్లకు పైగా బుల్లితెరపై నిర్విరామంగా ప్రసారం అవుతుంది ఈ షో. 2009లో స్టార్ కొరియాగ్రాఫర్ ప్రభుదేవా సమర్పకుడిగా ఈ టాలెంట్ షో ప్రారంభమైంది. కాగా జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా పరిచయమైన సుడిగాలి సుధీర్ ఢీ లో టీమ్ లీడర్ గా చేశారు. ఢీ సీజన్ 9కి రష్మీ, సుధీర్ ఎంట్రీ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 4, 2022 / 05:34 PM IST
    Follow us on

    Sudigali Sudheer: ఈ టీవి ఛానల్ లో ప్రసారం అవుతున్న డాన్స్ రియాలిటీ షో “ఢీ” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పదేళ్లకు పైగా బుల్లితెరపై నిర్విరామంగా ప్రసారం అవుతుంది ఈ షో. 2009లో స్టార్ కొరియాగ్రాఫర్ ప్రభుదేవా సమర్పకుడిగా ఈ టాలెంట్ షో ప్రారంభమైంది. కాగా జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా పరిచయమైన సుడిగాలి సుధీర్ ఢీ లో టీమ్ లీడర్ గా చేశారు. ఢీ సీజన్ 9కి రష్మీ, సుధీర్ ఎంట్రీ ఇచ్చారు. తొమ్మిదవ సీజన్ నుండి 13వ సీజన్ వరకు ఢీలో సుధీర్ కొనసాగారు. ఇటీవల ఢీ 14 మొదలైంది. ఢీ లేటెస్ట్ సీజన్ ప్రోమోలో సుధీర్, రష్మీ కనిపించలేదు. వారి స్థానంలో కొత్త ముఖాలు వచ్చి చేరాయి. బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ వచ్చారు.

    ఓపెనింగ్ ఎపిసోడ్ లో వీరు మిస్ అయ్యారని కొందరు భావించారు. తీరా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో కూడా సుధీర్, రష్మీ కనిపించలేదు. దీంతో వీరిద్దరినీ ఢీ నుండి తప్పించారు లేదా వారే తప్పుకున్నారనే ఊహాగానాలకు బలం చేకూరింది. తాజాగా సుడిగాలి సుధీర్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా.. అందులో సుధీర్, ఆది ‘ఆచార్య’ మూవీ థీమ్ గెటప్స్ వేశారు .ఇక ప్రశాంతి, రైజింగ్ రాజు దేవకన్యల గెటప్స్ వేశారు. స్కిట్ లో భాగంగా ప్రశాంతి… సుధీర్ ని ఉద్దేశిస్తూ… ‘మానవా.. మానవా!’, అని డైలాగ్ చెబుతుంది.

    ‘ఆల్రెడీ ఢీ మానేశాను. ఇంకేమి మానాల్రా బాబు’ సుధీర్ అంటూ కామెంట్ చేశారు. అది కాదు మానవా అని ప్రశాంతి మరో డైలాగ్ చెప్పగా, ‘అది మాత్రం మానేది లేదంటూ’ సుధీర్ నవ్వుతూ పంచ్ వేశాడు. ఈ షో నుంచి సుధీర్, రష్మీలను ఎందుకు తప్పించారనేది ఎవరికి అర్ధం కావడం లేదు. రెమ్యూనరేషన్ లేదా మరే ఇతర కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఇంకా ఉంది.

    జబర్దస్త్ కు గుడ్ బై | Sudigali Sudheer Sensational Decision