https://oktelugu.com/

జంపు జలానీలతో బీజేపీలో గుబులు?

గత నాలుగైదేళ్లుగా వివిధ రాష్ర్టాల్లో వేరే పార్టీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుని ప్రభుత్వాలను కూలగొట్టిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తాపత్రయ పడుతోంది

Written By:
  • Srinivas
  • , Updated On : June 13, 2021 / 04:13 PM IST
    Follow us on

    గత నాలుగైదేళ్లుగా వివిధ రాష్ర్టాల్లో వేరే పార్టీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుని ప్రభుత్వాలను కూలగొట్టిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తాపత్రయ పడుతోంది. బెంగాల్ లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఎక్కువ సీట్లు గెలుచుకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేలు టీఎంసీ తీర్థం పుచ్చుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

    టీఎంసీ నుంచి ఎన్నికల ముందు సాగిన వలసలతో బెంగాల్ లో బీజేపీ ప్రతిష్ట పెంచుకుంది. అయితే టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన నేతల్లో చాలా మంది ఇప్పుడు తిరుగుముఖం పడుతున్నారు. ఈ జాబితాలో కేంద్రమంత్రి ముకుల్ రాయ్ కూడా చేరిపోయారు. ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, కొందరు బీజేపీ నేతలు కూడా టీఎంసీలోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    రాయ్ తో ఇప్పటికే పలువురు నేతలు సమావేశమైనట్లు తెలుస్తోంది. రాయ్ ప్రోద్బలంతో గతంలో ఇతర పార్టీల నుంచి టీఎంసీలోకి చేరి ఆ తరువాత బీజేపీలోకి వెళ్లినా తిరిగి ఆయన వెంట తిరిగి టీఎంసీలో చేరిపోయే ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు టీఎంసీ వలస వ్యక్తులతో సంబంధం లేకుండా కొందరు ఎమ్మెల్యేలు సైతం బీజేపీని వీడి టీఎంసీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే సమావేశాలకు హాజరు కావడం లేదన్నట్లు భోగట్టా.

    ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కూడా ఇప్పుడు బీజేపీకి దూరం అయినట్లు సమాచారం. ఈ అంశంపై బెంగాల్ బీజేపీ శాసనసభా పక్ష నేత సువేందు అదికారి స్పందించారు. ముకుల్ రాయ్ పై అనర్హత వేటుకు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. తమ పార్టీ గీత దాటితే ఎమ్మెల్యేలపై కేంద్ర న్యాయశాఖతో చర్చిస్తారని చెబుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు చేజారిపోతుంటే చట్టం, న్యాయం వల్లె వేయడంతో పార్టీ ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకోవాలనే దానిపైనే దృష్టి సారిస్తున్నారు.