https://oktelugu.com/

టీఆర్ఎస్ ప్రశ్న: బీజేపీ అయోధ్య వసూళ్ల లెక్కలేవి?

అయోధ్యలో రామమందిరం నిర్మాణంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో ఊరూరా .. ఇంటింటా విరాళాలు సేకరిస్తున్నారు. అయోధ్య రామ మందిర కమిటీ.. బీజేపీ ఆధ్వర్యంలో ఈ విరాళాల సేకరణ నడుస్తోంది. ఈ విరాళాల సేకరణ పైనా పలువురు టీఆర్‌‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాద్దాంతం చేస్తున్నారు. మొన్నటికి మొన్న కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌‌రావు చేసిన వ్యాఖ్యలతో రచ్చకెక్కారు. తర్వాత ఆయన క్షమాపణ చెప్పి.. తోచినంత విరాళం ఇచ్చారు. ఇప్పుడు పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి అలాంటి వ్యాఖ్యలే చేశారు. రాముడి […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 1, 2021 / 10:31 AM IST
    Follow us on


    అయోధ్యలో రామమందిరం నిర్మాణంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో ఊరూరా .. ఇంటింటా విరాళాలు సేకరిస్తున్నారు. అయోధ్య రామ మందిర కమిటీ.. బీజేపీ ఆధ్వర్యంలో ఈ విరాళాల సేకరణ నడుస్తోంది. ఈ విరాళాల సేకరణ పైనా పలువురు టీఆర్‌‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాద్దాంతం చేస్తున్నారు. మొన్నటికి మొన్న కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌‌రావు చేసిన వ్యాఖ్యలతో రచ్చకెక్కారు. తర్వాత ఆయన క్షమాపణ చెప్పి.. తోచినంత విరాళం ఇచ్చారు.

    ఇప్పుడు పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి అలాంటి వ్యాఖ్యలే చేశారు. రాముడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తూ.. రాముడి పవిత్రతను బీజేపీ అపవిత్రం చేస్తోందని విమర్శలు చేశారు. దేవుడి పేరుతో ఇష్టానుసారం వసూళ్లు చేస్తున్నారని.. పటేల్ విగ్రహానికి వేలకోట్లు పెట్టారు.. రాముడిగుడి నిర్మించలేరా అని ప్రశ్నించారు. అంతే కాదు.. అసలు వసూలు చేసిన సొమ్ముకు లెక్కలు చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు.

    ధర్మారెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆందోళనలు చేపట్టడం కామనే. దానికి తగ్గట్లుగానే ఆయన ఇంటిపైకి బీజేపీ కార్యకర్తలు ధర్నాకు వెళ్లారు. ఇంటిపై కోడిగుడ్లు విసిరేశారు. ఈ ఫలితంగా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించాల్సి వచ్చింది. ధర్మారెడ్డి కోరుట్ల ఎమ్మెల్యేలా కాకుండా విరాళాలకు లెక్కలు చెప్పాలని అడుగుతున్నారు. బీజేపీ నేతలు ఊరూవాడా చందాలు వసూలు చేస్తున్నారు. ఆ డబ్బులన్నీ ఎటు పోతున్నాయి.. నిజంగానే అయోధ్య రామాలయానికి పంపుతున్నారా లేదా అన్నది విరాళాలు ఇస్తున్న వారిలోనూ సందేహం ఉంది.

    అయితే.. ఇటీవల కొంత మంది నేతలు సొంతగా రాముడి విరాళాల కోసం పుస్తకాలు ముద్రించి డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిపై అయోధ్య రామాలయ ట్రస్ట్ కూడా స్పందించింది. అలాంటి విరాళాల సేకరణ చట్ట విరుద్ధమని.. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. కానీ వసూళ్లు ఎవరు పడితే వారు చేస్తున్నారు. చోటా బీజేపీ నేతలందరూ అదే పనిలో ఉంటున్నారు. దాదాపుగా ప్రతీ ఇంటి నుంచి చందా వసూలు చేస్తున్నారు. అందుకే.. కొందరికి వీటిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.