సాగర్‌‌లో అభ్యర్థుల వేట

మరికొద్ది రోజుల్లో నాగార్జున సాగర్‌‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇందుకు ఇప్పటినుంచే అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి. అయితే.. ఇప్పటివరకైతే ఏ పార్టీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ.. నాగార్జున సాగర్‌‌ సీటును బేస్‌ చేసుకొని పాలిటిక్స్‌ మాత్రం నడుస్తున్నాయి. అంతోఇంతో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జానారెడ్డి అన్న విషయం మొన్నటివరకు క్లారిటీ ఉండేది. కానీ.. ఉన్నట్టుండి జానారెడ్డి కూడా బరిలో నుంచి తప్పుకున్నారు. ఆయన కుమారుడి పేరును తలుస్తున్నారు. వీలైనంత వరకూ […]

Written By: Srinivas, Updated On : February 1, 2021 10:17 am
Follow us on


మరికొద్ది రోజుల్లో నాగార్జున సాగర్‌‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇందుకు ఇప్పటినుంచే అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి. అయితే.. ఇప్పటివరకైతే ఏ పార్టీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ.. నాగార్జున సాగర్‌‌ సీటును బేస్‌ చేసుకొని పాలిటిక్స్‌ మాత్రం నడుస్తున్నాయి. అంతోఇంతో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జానారెడ్డి అన్న విషయం మొన్నటివరకు క్లారిటీ ఉండేది. కానీ.. ఉన్నట్టుండి జానారెడ్డి కూడా బరిలో నుంచి తప్పుకున్నారు. ఆయన కుమారుడి పేరును తలుస్తున్నారు.

వీలైనంత వరకూ ఆయన కుమారుడిని బరిలో దింపేందుకే రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ, టీఆర్ఎస్ మాత్రం అభ్యర్థుల కోసం వేట సాగిస్తున్నాయి. ఇందులో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు చాలా మంది పోటీ పడుతున్నారు. అధికార పార్టీ కామన్‌గా ఆ పోటీ ఎలాగూ ఎక్కువగానే ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఇక బీజేపీ ఏమో ఓ బలమైన అభ్యర్థి కోసం వేట సాగిస్తోంది. ఎవరికి గాలం వేయడమా అని చూస్తోంది.

బీజేపీ హిట్ లిస్ట్‌లో తేరా చిన్నపరెడ్డి నేత ఉన్నట్లు వినికిడి. ఆర్థికంగా బలమైన నేత కావడం.. గతంలో టీడీపీ తరపున పోటీ చేసి జానారెడ్డిపై స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈ సానుభూతి కూడా ఉండటంతో ఈ సారి బీజేపీ తరపున బరిలో దింపాలని ప్రయత్నిస్తున్నారు. ఇది ఎలా లీక్‌ అయిందో.. లేక పుకారో తెలియదు కానీ.. ఆయన బీజేపీ నేతలను కలిశారని.. టిక్కెట్ కూడా అడిగారని ప్రచారం ప్రారంభమైంది. కానీ.. ఆయన మాత్రం తీరిగ్గా స్పందించారు. తాను ఎవరినీ కలవలేదని చెబుతున్నారు. అంతటితో వదిలి పెట్టలేదు. సాగర్ టిక్కెట్‌పై తనకు ఎంతో ఆసక్తి ఉందని ప్రకటనలు చేస్తున్నారు. కేసీఆర్‌ ఆదేశిస్తే ఉప ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని చెబుతున్నారు.

టీఆర్ఎస్ కూడా నోముల కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇవ్వాలని అనుకోవడం లేదు. బలమైన అభ్యర్థినే రంగంలోకి దింపాలనుకుంటోంది. వారి జాబితాలో చిన్నపరెడ్డి కూడా ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. బీజేపీకి అక్కడ స్వతహాగా బలం లేదు. బీజేపీలో చేరే అభ్యర్థితోనే బలం రావాల్సి ఉంది. అలాంటి అభ్యర్థి కోసం వెతుకుతున్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ అనసరించిన వ్యూహంలాగే టీఆర్ఎస్ టిక్కెట్ ఖరారు చేసుకున్న తర్వాత అసంతృప్తితో ఎవరైనా ముఖ్య నేత బీజేపీలో చేరితే.. ఆయననే పోటీ పెట్టినా ఆశ్చర్యం లేదు. మరోవైపు విజయశాంతి పేరును కూడా ప్రచారంలోకి తీసుకొచ్చేశారు.