
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతోన్నాయి. ఇటీవల జరిగిన దుబ్బాక.. గ్రేటర్ ఎన్నికలను ఒకసారి పరిశీలిస్తే రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సీన్ మారినట్లు కన్పిస్తోంది.
Also Read: వరంగల్ కార్పొరేషన్ పై బీజేపీ ‘గురి’..!
కొద్దిరోజులుగా తెలంగాణలో టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తుండగా బీజేపీ మాత్రం దూసుకెళుతోంది. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అనే సంకేతాలను ప్రజల్లోకి బీజేపీ బలంగా తీసుకెళుతోంది.
ఈక్రమంలోనే టీఆర్ఎస్.. బీజేపీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. బీజేపీ నేతలు టీఆర్ఎస్ పై అనేక ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ మాత్రం బీజేపీ విమర్శలను తిప్పికొట్టలేక సైలంట్ అవడం చర్చానీయాశంగా మారుతోంది.
ఈక్రమంలోనే బీజేపీ నేత.. మాజీ ఎంపీ వివేక్ సీఎం కేసీఆర్ కు హెచ్చరికలు జారీ చేశారు. కేసీఆర్ కుటంబ పాలన అంతానికి తాను బీజేపీలో చేరినట్లు తెలిపారు. దుబ్బాక.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దీనిని కొంతవరకు సాధించినట్లు తెలిపారు.
Also Read: కేసీఆర్ నిర్ణయం వెనుక కుట్ర: బండి సంజయ్ సంచలన ఆరోపణ
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ను పూర్తిగా మట్టికరిపించడమే లక్ష్యంగా తాను పని చేస్తున్నట్లు వివేక్ తెలిపారు. కేసీఆర్ అవినీతిని తాను ప్రశ్నిస్తున్నందుకు కౌంటర్ కొందరు టీఆర్ఎస్ నాయకులు తాను పార్టీ వీడుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
అదేవిధంగా తన ఆస్తులపై సీఐబీ ఎంక్వైరీకి సిద్ధమేనని.. కేసీఆర్ కూడా తన ఆస్తులపై సీబీఐ దర్యాప్తు కోరుతారా? అంటూ సవాల్ విసిరారు. తాను పార్టీ మారుతున్నట్లు వార్తల్లో నిజంలేదని వివేక్ స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్