Dalit bandhu:బీజేపీ పోరుబాట పట్టింది. హుజూరాబాద్ ప్రచారంలో తాము రూ.10వేల చొప్పున ఓటర్లకు పంచుతున్నామని వీడియోల్లో ప్రచారం చేస్తున్నారని.. దళితబంధును ఈసీకి లేఖ రాసి ఆపేశామని బీజేపీపై మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను ఖండించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాసింది. హరీష్ రావుకు ఈ సందర్భంగా బీజేపీ కౌంటర్ ఇచ్చింది. దళితబంధును బీజేపీ ఆపలేదని స్పష్టం చేసింది.

దళితబంధు విషయంలో నాపై, భారతీయ జనతా పార్టీపై అసత్య ఆరోపణలు, దుష్ప్రచారం చేసిన రాష్ట్ర ఆర్థికశాఖా మాత్యులు, అబద్ధాల మంత్రిగా పేరుగాంచిన హరీశ్ రావు తప్పును ఒప్పుకొని తెలంగాణ ప్రజలకు, దళిత సమాజానికి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. హుజూరాబాద్ లో బీజేపీ వీడియోలను పంచుతోందని వీడియోలను సర్క్యూలేట్ చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ జనరల్ సెక్రెటరీ ప్రేమేందర్ రెడ్డి తాజాగా లేఖ రాశారు. ఇదంతా టీఆర్ఎస్ కుట్ర అని స్పష్టం చేశారు.
దళితబంధును ఆపివేయాలని బిజెపి కోరలేదని హైకోర్టు స్పష్టం చేసింది. దళితబంధును హుజురాబాద్ లో అమలు చేయడం ఇష్టం లేక తన సంకుచిత రాజకీయ స్వలాభం కోసం రాష్ట్ర ప్రభుత్వం.. ఆ అపనిందను బీజేపీపై నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేసిందని బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. ఎన్నికల కమిషన్ ముందు సరైన వివరాలు సమర్పించడంలో విఫలమైనట్లుగా నిన్న హైకోర్టు ఎదుట స్పష్టమైంది.
దళితబంధు విషయంలో మంత్రి హరీశ్ రావు ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం పదేపదే బీజేపీని, నన్ను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేసినందుకు ప్రజలందరికి క్షమాపణలు చెప్పాల్సిందేనని ప్రేమేందర్ రావు అన్నారు. లేనియొడల జడ్జిమెంట్ పూర్తి వ్రాతపతిని పరిశీలించిన తర్వాత ఆర్థికమంత్రి హరీష్ రావు గారిపై పరువునష్టం దావా వేస్తాం.