Mithun Chakraborty: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఈ నిర్ణయం భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. సిందూ ఒప్పందం నిలిపివేతతో పాకిస్తాన్‌లో వ్యవసాయం కష్టంగా మారింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాగునీటికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఈనేపథ్యంలోనే భారత చర్యలపై పాక్ ఆర్మీచీఫ్ పిచ్చికూతలు కూశాడు. అమెరికా అండ చూసుకుని అణు వ్యాఖ్యలు చేశారు. భారత్ డ్యాంలు నిర్మిస్తే క్షిపణులతో పేల్చేస్తామని ప్రకటించారు. తాజాగా పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో యుద్ధ బెదిరింపులు చేశారు. భారత్ చర్య యుద్ధం ప్రోత్సహించేలా ఉందని పేర్కొన్నారు. అదే జరిగితే సిందూ నదిలో రక్తం పారుతుందని హెచ్చరించారు. పాకిస్తాన్ మాజీ మంత్రి వ్యాఖ్యలపై భారతీయులు మండిపడుతున్నారు. బీజేపీ నేత, నటుడు మిథున్ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సామాజిక చర్చలకు దారితీశాయి.
Also Read: ఇంగ్లాండ్ సిరీస్ లో రాణించినప్పటికీ వారిపై వేటు.. ఆసియా కప్ లో ఆడేది వీరే..
140 కోట్ల మంది తల్చుకుంటే..
మిథున్ చక్రవర్తి తన వ్యాఖ్యలలో 140 కోట్ల భారతీయులను ఒక ఆనకట్టలో మూత్ర విసర్జన చేయమని, దాని గేట్లు తెరిస్తే పాకిస్తాన్‌లో సునామీ వస్తుందని పాకిస్తాన్ మాజీ మంత్రికి వ్యంగ్యంగా రిప్లయ్ ఇచ్చారు. రాజకీయ నాయకులు, ప్రముఖుల వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతాయి. మిథున్ వంటి సినీ నటుడు, రాజకీయ నాయకుడు కావడం వల్ల ఆయన మాటలు మరింత దృష్టిని ఆకర్షిస్తాయి. ఈ వ్యాఖ్యలు ఒకవైపు బీజేపీ మద్దతుదారులలో ఉత్సాహాన్ని కలిగించినప్పటికీ, మరోవైపు అవి దౌత్యపరమైన సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉంది.
భారత్–పాక్ జల వివాదం..
సింధు జల ఒప్పందం రద్దు చేయడం అనేది సంక్లిష్టమైన అంశం. ఈ ఒప్పందం 1960 నుంచి భారత్, పాకిస్థాన్ మధ్య జల వనరుల పంపిణీని నియంత్రిస్తోంది. భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తే, అది పాకిస్తాన్‌లోని వ్యవసాయ, జల వనరులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకోవాల్సింది పోయి.. పాక్ ఆర్మీ చీఫ్, మాజీ మంత్రి బెదిరింపులకు దిగుతున్నారు. ఇది భారత్‌ను రెచ్చగొట్టేలా ఉంది. సమస్య పరిష్కారం కన్నా.. యుద్ధం చేయాలన్నట్లు మాట్లాడడంపై భారతయులు మండిపడుతున్నారు.